Dootha




 అమెజాన్ ప్రైమ్ నుండి ఇంకో సస్పెన్స్ - క్రైం - థ్రిల్లర్ రెడీ అయింది. డిసెంబర్ 1 నుండి స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ నిజంగానే ఓ థ్రిల్లర్. రాజకీయం జర్నలిజం రెండు పట్టాల్లా ఉండాలి అనే నిజానికి - నాతోపాటు నువ్వు ఎదగాలి, కాలంతో పాటు విలువలని చూసి చూడనట్టు వదిలేయాలి మారాలి అనే రెండు అంశాల మధ్య పోరు. మొత్తం 8 ఎపిసోడ్ లలో 5 వ ఎపిసోడ్ వరకు ఎటువంటి క్లూ కూడా దొరకదు. ఇందులో దొరికినట్టే దొరికి ట్విస్ట్ చూయించాడు డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఇక్కడి నుండి కొద్ధి కొద్ధి గా కధ సస్పెన్స్ వీడిపోతూ ఉంటుంది. ఓ న్యూస్ పేపర్ పీస్ చుట్టూనే ఈ సిరీస్ మొత్తం తిరుగుతుంది. అందులో జరగబోయే విషయాలు, ఎవరు-ఎప్పుడు ఏం చేస్తారు అనే విషయం చెప్పడం అది నిజమవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఓ మంచి కధతోనే వచ్చారనిపించింది. సింపుల్ గ చెప్పేద్దాం అనటానికి న్యూస్ పేపర్ థ్రిల్లర్. ఈ సమాజంలో నిజం పేరుతో జరుగుతున్న జర్నలిజం అవినీతిని, కాలుష్యాన్ని, బేసిక్ పాయింట్ గా తీసుకొని కథను అళ్లారు. కాకపొతే స్క్రిప్ట్ మాత్రం కొత్తగా సస్పెన్స్ గా రచించారు. కాస్త సమయం వెచ్చించి చూడల్సిన సిరీస్ ఏ ఇది. ఆసాంతం ట్విస్ట్ లతోనే నడిచింది. దూత : అంటే సమాజానికి నిజానికి మధ్య వారధిని నడిపే దేవదూత గా అభివర్ణించారేమో దర్శకుడు. వరుసగా చనిపోతూ వచ్చిన ప్రతి అవినీతి జర్నలిస్ట్ లు, హత్య ఆత్మహత్య అనేది సస్పెన్స్ గా నడుస్తుంది. ఏకాగ్రతగా యోచిస్తే ఎవరో గమనిస్తున్నారు అని మాత్రమే అర్ధం అవుతుంది. ఎవరన్నది చూసి తెలుసుకోవాల్సిందే. అక్కడక్కడా సన్నివేశాలు గతంలో చూసినట్టు అనిపిస్తాయి . చూడదగిన సిరిస్ . సిరిస్ లో వాడిన అసభ్య పదజాలం ఊత పదంగా వాడటం కాస్త అసంబద్ధం గ అనిపించింది. క్లైమాక్స్ మంచిగా ముగించారు. 

నటన: నాగచైతన్య, ప్రియభవాని శంకర్ తో పాటు ఇంకొంతమంది తెలిసిన ప్రముఖ నటులే 

ఎవరెవరు ఎలా చేసారు : 

చై మాత్రం కరప్టెడ్ జర్నలిస్ట్ గా బాగానే చేసారు. ఇక హత్తుకునేలా ఉందా లేదా అనేది అది ఫ్యాన్స్ ఇష్టం

ప్రియభవానిశంకర్ : సాధారణ హౌస్ వైఫ్ అప్పుడప్పుడు కరప్టెడ్ హస్బెండ్ భార్య- జర్నలిస్ట్ లా 

ఇతరులు: ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారనే చెప్పాలి.. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog