The Village

ది విలేజ్ వెబ్ సిరీస్ 


వివిధ భాషలలో OTT platform అమెజాన్ ప్రైమ్ లో 24 నవంబర్ నుండి స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ హారర్  సినిమాని గుర్తుచేస్తుంది. ఆర్య, దివ్య పిళ్ళై ముఖ్య తారాగణంగా నటించిన 6 ఎపిసోడ్స్ కూడా హాలీవుడ్ యాక్షన్ మూవీని గుర్తుచేస్తున్నాయి. కధ ఐతే మంచిగానే రచించారు. ఈ మధ్య వస్తున్న ట్రెండ్ లా ఒక్కో విషయం గురించి చెపుతూ, దానికి అంతకుముందు జరిగిన కధని గుర్తు చేయటం ఆడియెన్స్  లో  కొంచం ఆలోచన పెంచినప్పటికీ అప్పుడప్పుడు అటు-ఇటు పరిగెత్తించటం సహనాన్ని కూడా పరీక్షిస్తుంటాయి. కొంచం ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు కూడా వున్నాయి. సున్నితమైన వాళ్ళు ఈ సిరీస్ చూడటానికి ఆలోచించుకోవాలేమో.  కోపోద్రేకంతో కూడిన కొన్ని సన్నివేశాలు అవసరమైనప్పటికీ డైరెక్టర్ వికృతంగా చూపించారు. గౌతమ్(ఆర్య), నేహా (దివ్య) తమ కూతురు మాయ తో కలిసి ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తూ దారి మార్చుకోవటంతో అసలు కధ మొదలవుతుంది. ఓ సైంటిస్ట్ - బిజినెస్ మాన్ తన ప్రయోగంలో భాగంగా చేసిన ఓ ప్రయత్నం విఫలమవడం అది తమిళనాడు లోని " కట్టియల్ " గ్రామంకి శాపంగ మారి తీవ్ర పరిణామాలు రావటం వలన జరిగిన ఫలితాలతో కధ ఆ గ్రామం చుట్టూ తిరుగుతుంది. అదే ది విల్లెజ్ . ఆర్య- నేహా, కట్టియల్ గ్రామస్తులు , సైంటిస్ట్ ఫామిలీ ఈ ముగ్గురి మధ్యన అన్ని ఎపిసోడ్స్ తిరుగుతుంటాయి. ఓ మూఢ నమ్మకం, ఓ ఆధునిక ప్రయోగం, ఓ తండ్రి తన బంధాల కోసం ఈ మూడు సమాంతరంగా కలిసి చేసిన ప్రయాణమే ఈ విల్లేజ్. 

సిరీస్ రచన : Rau, V Deeraj Vaidy and Deepthi Govindarajan.
కధా మూలం : గ్రాఫిక్ నోవెల్ The Village  by Aswin Srivatsangam, Shamik Dasgupta and Vivek Rangachari.

డైరెక్షన్ : Milind Rau (AVAL)
సౌండ్Girish Gopalakrishnan ,  Original Music Composer
డి. ఓ. పిSivakumar Vijayan
-- 
అవ్యజ్ (శంకర్)

 

Search This Blog