Martin Luther King

మిళ సినిమా మండేలా కి పునర్నిర్మాణంగా వచ్చిన సినిమా మార్టిన్ లూథర్ కింగ్ . ఈ పేరు సినిమాకి కధకి ఎంచుకోవడం హర్షణీయం. సంపూర్ణేష్ బాబు తో నటిగ శరణ్య కలిసి డైరెక్టర్ పూజ కొల్లూరు, అద్భుత కథతో వచ్చాడు. బేసిక్ గ ఓ నీతి నిజాయితీ లాంటి పాతబడిన పదాలతో తిరిగే సినిమా కనుక జనాలకి పెద్దగా ఎక్కదు, ఎందుకంటె అన్ని తెలిసి చేసే పనులే కాబట్టి. సినిమా కోసం కధలో కొంచం ఎక్కువ  తక్కువలు కల్పించి సాగతీయటం నిజమే. నిజ జీవితంలో ఓ ఓటరుని నాయకులు ప్రలోభ పెట్టే  సన్నివేశాలన్నీ కళ్ళకి కట్టినట్లు చూయించారు. వివిధ రాజకీయనాయకులు చేసే పనులు కూడా ఇందులో ఉదహరించారు. ఒక్క మాటలో ఓటరుకి రాజకీయానికి వున్న  (అ)మంచిసంబంధాన్ని గొప్పగా రచించారు. తాకడానికి కూడా ఆలోచించే ఓ అణగారిన వర్గం నుండి కొత్తగా ఓటు వచ్చిన ఓ పేద ఓటరుని తీసుకొని వాళ్లకి ఇవ్వాల్సిన తాయిలాలు అన్ని ఇచ్చి, అందరు విన్నట్టు నయానో భయానో ఒక్క ఓటుతో రాజ్యాల్ని శాసించాలని ఆశపడుతున్న పొలిటీషియన్స్ మధ్యలో వున్న బలహీనతల్ని, ఓటరు అనుకుంటే - నాయకుల ప్రలోభాలకు ముందు తరువాత ఒక్క ఓటుతో ఏమేం చేయచ్చో చూయించారు. ఇక నటన నటులు సాంకేతికం ఈ చిత్రానికి పెట్టిన ఖర్చుకి న్యాయం చేసినట్టే. చివరలో ఏంటంటే ఇలాంటి సినిమాలు తరుచు వస్తూనే వున్నా సినిమాలకే పరిమితమయ్యి ఓటరు స్వతంత్య్రం పూర్తిగా వ్యక్తిగతంగా, కొందరికి కులం, కొందరికి అందివచ్చిన పధకాలు, లాభసాటి వ్యాపారాలు, ఇంకొందరికి ఏ దారిలేక ఎవరొకరికి ఉన్నంతలో అన్నట్టు నిర్ణయాలు తయారు అవ్వడమే అలోచించి బాధపడాల్సిన విషయం. అవును పోలింగ్ అంటే ఎక్కువశాతం మందికి నచ్చిన ఫలితానికి ప్రజాస్వామ్యంలో ఆచరించడమనేది నిజమేగా? ఆ ఎక్కువ మంది కోసమే ఈ ప్రజాస్వామ్య పోరాటం మంచికోసం ఎదురెళ్లి చెమటోడ్చి నీరుగారి చెదిరిపోయి అలసిపోయి వోటరుతో పాటు ఆనవాయితీగా మారుతూ దిగజారుతూ వచ్చింది. 

డైరెక్టర్ : పూజ కొల్లూరు 

రచన : మడోన్నా అశ్విన్, వెంకటేష్ మహా 

నటించినవాళ్లు : సంపూర్ణేష్ బాబు, శరణ్య ప్రదీప్ (ఫిదా ఫేమ్ సాయి పల్లవి సిస్టర్), నరేష్, కొందరు నూతన నటులు 
OTT : Sony Liv
-- 
అవ్యజ్ (శంకర్)

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog