Ahimsa - అహింస


అభిరాం దగ్గుబాటి హీరోగా, గీతికా తివారి నూతన పరిచయంలో, హిట్ కాంబినేషన్ ఆర్.పి.పట్నాయక్ - డైరెక్టర్ తేజతో కలిసి చేసిన మరో చిత్రం. నిజం అని అబద్ధం చూయించడం , అహింస అని హింసని చూయించటం తేజ మార్క్ దర్శకత్వం. బావ మరదలు అయిన సాధారణంగా ఉండే ప్రేమ. కృష్ణ తత్వాన్ని హింసగా బోధిస్తూ సరదాగా నటించటం, అహింసే సిద్దాంతంగా బ్రతుకుతుండే హీరో గ అభిరాం పరిచయ సన్నివేశాలుతో సున్నితంగా మొదలెట్టి గీతికా తివారిని ఇద్దరు డబ్బున్న వాడి పిల్లలు రేప్ చేయడంతో విలనిజం కధలోకి  ప్రవేశించి హింస మొదలవుతుంది. అడుగడుగునా డబ్బుకు అమ్ముడుపోయిన మనుషుల మధ్య మరదలి ప్రాణాలు రక్షించుకుని, చట్టం, వైద్యం, పోలిస్ వ్యవస్థలు కలిపి తన మరదలికి చేసిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఎలా పగ తీర్చుకున్నాడు అనేది చిత్ర కథాంశం. తేజ మునుపటి సినిమాల్లో వలెనే పల్లెటూరి నేపథ్యం అదే రక్త సిక్తం అయ్యే హీరోయిజం, కధలో లోపాలు కన్పిస్తాయి. సంగీతం, పాటలు, డబ్బింగ్ లోని లోపాలు కూడా సినిమాకి నెగటివ్ ఫలితాన్ని కట్టబెట్టాయి. లాయర్ పాత్రలో సద తక్కువ సమయమే ఉంటుంది. మిగిలిన ముఖ్యమైన పాత్రలు కూడా హిందీ వారు అవ్వడం కొంత నెగటివ్. 
OTT- అమెజాన్ ప్రైమ్ 
-- 
అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog