Vadhuvu Series

వధువు వెబ్ సిరీస్

Avika Gor  ఇందుగా మెయిన్ రోల్ లో డిస్నీ హాట్ స్టార్ లో 8 డిసెంబర్ నుండి స్ట్రీమ్ అవుతున్న సస్పెన్స్ సిరీస్ ఈ 'వధువు '.  అవికాగోర్ ప్రేమించిన అబ్బాయిని కాకుండా ఆనంద్ (నందు) ని పెళ్లిచేసుకోవడంతో కధ మొదలవుతుంది. ఎవరికి వారు అనుమానాస్పదంగ కనిపిస్తుండటం సస్పెన్స్ చిత్రాల్లో సాధారణం. Ali Reza, Nandu అన్నదమ్ములుగా మంచి పాత్రనే పోషించారు. అగ్రెసివ్ 'నందు" అనచ్చు, ఇక అలీరెజా ని సూపర్ కూల్  కన్నింగ్ల ఏమో  అనిపించేలా డిస్క్రైబ్ చేయచ్చు. అవుట్ హౌస్ లో వున్న నందు వాళ్ళ సిస్టర్ పాత్ర చూస్తే పాత జమిందార్ సినిమా గుర్తుకు తెస్తుంది. ఎక్కడా క్లూ వదలకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. తనంత తానే కధ రెవీల్ చేసే వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటె ఎటువంటి గతం యొక్క ఛాయలు కనిపించవు. ఒక్క వైష్ణవి పేరు మాత్రం కనిపించకుండా వినిపిస్తుంటుంది చివరి వరకు. ఇందు ఇంట్లో జరిగే సంఘటనలన్నిటికి కారణం ఆర్య భార్య వైష్ణవి అని అందరు బలంగా నమ్ముతారు. ఇంటి నుండి వెళ్లగొట్టిన వైష్ణవి నిజంగా ఇదంతా చేస్తుందా అని తెలుసుకోడానికి వెళ్లిన ఇందుకి వైష్ణవి కనిపించకపోవడం తరువాత తను చనిపోయినట్టు ఇన్స్పెక్టర్ చెప్పిన విషయంతో షాక్ మరియు అసలు విషయాన్నితేల్చాలి అని ఆలోచన మొదలవుతుంది ఇందుకి. తరువాత అది ఆత్మహత్య కాదు మర్డర్ అని పోస్టుమార్టుమ్ లో తెలియడంతో ఇటు ఇందు అటు ఇన్స్పెక్టర్ కారణాలని ఆరా తీయడంతో చివరి భాగంలో అన్ని విషయాలకి శుభం కార్డు తో తెర పడుతుంది అనుకుంటాం. కుటుంబంతో చూడచ్చు. మంచి నరేషన్. కారణం ఎవరు అనేది రివీల్ చేయకపోవడం నిరాశ !

- - గుడ్ లక్ - - 

నటవర్గం : Avika Gor, Ali Reza, Nandu, V.S. Roopa Laxmi, Mounika, Madhavi Prasad, Sridhar Reddy, and others
కధా మూలం : ఇందు బెంగాలీ సిరీస్ 
డైరెక్షన్ & రచన : Poluru Krishna - Nice
నిర్మాతలు : Shrikanth Mohta, Mahendra Soni - Good Luck
సంగీతం & బి. జి. ఎం. : Sriram Maddury - So So
సినిమాటోగ్రఫీ : Ram K Mahesh - Good
ఎడిటింగ్ : Anil Kumar - Good

--

అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog