S.P.A.R.K. - LIFE

 స్పార్క్ లైఫ్ కొత్త సినిమా : సైలెంట్ గా OTT Plat form  అమెజాన్ ప్రైమ్ లో 12 నుండి 

విక్రాంత్ రెడ్డి హీరోగ నూతన పరిచయంలో స్వీయ రచన, స్క్రీన్ ప్లే , దర్శకత్వంతో వచ్చిన సినిమా. ఓపెనింగ్ సీన్ తో  థ్రిల్లర్ సినిమాగా హింట్  ఇచ్చి తరువాత రొమాంటిక్ ఫస్ట్ లవ్ ని పరిచయం చేస్తూ హీరో పాస్ట్ అండ్ ప్రెసెంట్ ని కలిపి ఆడియెన్స్  కి ప్రెసెంట్ చేస్తూ సాగుతుంది. మధ్య మధ్య లో వచ్చే సహకార పాత్రల అనుమానాస్పద హత్య, ఆత్మహత్యలు సాధారణ ఆడియెన్ కి కొంచం సస్పెన్స్ అనిపిస్తాయి. ఇదిలా ఉండగా ఆర్య తో ప్రేమలో పడిన లేఖ ఈ హత్యలు ఆర్యనే చేస్తున్నాడని ఇంట్లో మెయిడ్ చెప్పిన మాటతో జరిగిన చర్చ లో ఆర్య తన పాస్ట్ రివీల్ చేస్తాడు. ఇక్కడి నుండి అసలు కధ మొదలయినట్టుగా చెప్పుకోవాలి. ఇక్కడి నుండి ఆ ఆత్మ హత్యలకు ఎవరు కారణం అని వెతుకుతూ చిత్రం ద్వితీయార్ధంలో ఆర్య వాటికి కారణం SPARK అని, ఆ S.P.A.R.K ఎక్స్పరిమెంట్ కి ముగింపు పలుకుతాడు. 

బలం: ద్వితీయార్ధంలో కధకి ఉన్న మలుపులు , ఏమా అందం - ఏమా అందం, లేఖా లేఖా నీతోనే చివరిదాకా, జ్ఞాపకాలే సంతకాలు అనే పాటలు, బాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నాయికలు, కొత్త అంశం  

బలహీనతలు : చిత్రానికి సరిపడా హాస్యం లేకపోవడం, తేలిపోయినట్టున్న విక్రాంత్ (ఆర్య) నటన, ప్రథమార్ధంలో లోపించిన ఉత్సాహం, హత్తుకునేలా లేని ఎమోషన్స్ , అక్కడక్కడా తప్పిన స్క్రిప్ట్ లాజిక్ 
తారాగణం : 
Vikranth (ఆర్య, జై), Mehreen Pirzada (లేఖ ), Rukshar Dhillon (అనన్య), Nassar (ఆర్మీ ఆఫీసర్), Vennela Kishore (ఆర్య' స్  ఫ్రెండ్ ), Suhasini Mani Ratnam (సైకాలజిస్ట్ ), Satya akkala, బ్రహ్మాజీ ,  ఇంకొందరు యూట్యూబ్ ఆక్టర్స్ తో కలిపి

సంభాషణలు : ఉమర్జి  అనురాధ 
సినిమాటోగ్రఫీ :  A R Ashok Kumar 
ఎడిటర్ :  Prawin Pudi 
సంగీతం : Hesham Abdul Wahab (విజయ్ దేవరకొండ ' స్ ఖుషి సినిమా )
నిర్మాత :  Leela Reddy 
నిర్మాణం : Deaf Frog Productions 
Additional Info 

సాహిత్యం :  Ananth Sriram 
గాయకుడు :  Sid Sriram 
కళా దర్శకత్వం : S Ram Prasad 
స్టంట్స్ :  Jaguvar Krishnan 
నృత్య దర్శకత్వం : Moin Master

-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog