Vyooham series 2023

Vyooham Title Banner

వ్యూహం 

OTT లో సస్పెన్స్ థ్రిల్లెర్స్ ఒరవడి సాగుతూనే వుంది. అదే కోవలోకి వచ్చిన లేటెస్ట్ సిరీస్ వ్యూహం; ఓ సస్పెన్స్ క్రైమ్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ఓ క్రైమ్ స్టోరీ ని ఛేదించటం అనే అంశంతో ఆధారపడి వుంది. ఓపెనింగ్ షాట్ లో అంబులెన్సు లో ఓ ప్రెగ్నెంట్ విమెన్ ని తీసుకెళ్తుంతుండగా ఆ అంబులెన్స్ ప్రమాదానికి గురికావడంతో మొదలు అవుతుంది. ఇలా ఎపిసోడ్ మొదలు పెట్టి వరుసగా పాత్రల పరిచయంతో సాగుతుంది. చైతన్య కృష్ణ ప్రెగ్నెంట్ గ ఉన్న తన వైఫ్ జెస్సిని చెకప్ కి తీసుకువెళ్తున్న సమయంలో వరుసగా రెండు ప్రమాదాలు తప్పిపోయి జరిగిన ఆఖరి ఆక్సిడెంట్ జరగడంతో అసలు కధ మొదలు అయితుంది.ఈ ప్రమాద కేసు అర్జున్ రామచంద్రన్ దగ్గరకి వెళ్లడం జరుగుతుంది. ఇక్కడి నుండి ఒక్కో పాత్ర ప్రవేశించడం తదుపరి ఆ కేసు మలుపులు తిప్పుతూ ఎక్కడెక్కడో ఉన్న వేరే ముద్దాయిలకు సాక్షులకి అనుసంధానించబడుతూ సాగి అనుమానాస్పదంగా వ్యక్తుల అధికారుల నడుమ సాగి ఓ మైనింగ్ ఫ్యాక్టరీ గొడవలో జరిగిన జర్నలిస్ట్ హత్యకి చేరి, దానినుండి మరలి, మొదటి ఎపిసోడ్ లో కనిపించిన నిజాయితీ గల పోలిస్ ఆఫీసర్ హీరో అర్జున్ రామచంద్రన్ తల్లి వాణి రామచంద్రన్  హత్యకు కారణాలు వెతుకుతూ వెళ్తుంది. ఇన్ని ఎపిసోడ్స్ లో ఒక్కో వ్యక్తులు రావడం వారి గతం ఎదోలాగా మైఖేల్ ఆక్సిడెంట్ కి ముడిపడి ఉంటూ తీగ లాగితే డొంక కదిలినట్టు ఎప్పుడో క్లోజ్ చేసిన వాణి రామచంద్రన్ హత్యకు దారి తీసిన కారణాలను వెలికి తీసి అసలు నిందితులను పట్టుకుంటుంది. 

బలమైన అంశాలు : అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం, స్క్రిప్ట్, కధలో వస్తున్న మలుపులు అర్ధం కాని కారణాలు కొంచం ఆలోచించేలా చేయడం. 

బలహీనమైన అంశం :  సిరీస్ భాగాల నిడివి ఎక్కువ ఉండటం, అనవసరంగా కల్పిత పాత్రలని సృష్టించాడేమో అనిపించేటువంటి మలుపులు, అన్ని ఒకే కేసుకి సంబంధమా లేదా వేరువేరు కేసుల మధ్య సాగుతుందా అనిపించే సిరీస్ బ్లాక్స్ 

Cast : Sai Sushanth Reddy(Arjun Ramachandra), Chaitanya Krishna (Michael Manohar), Ravindra Vijay (Inspector akbar ), Shashank(Chaitanya), Preethi Asrani(Niharika& Neelaveni), Pavani Gangireddy (Jessica), Swetaa Varma (Vani ramchandran ), TV Actress Ritu Chowdary (Pallavi)

Director : Shashikanth Sri Vaishnav
Producer: Supriya Yarlagadda
Music : Sri Ram Madduri
Banner : Annapurna Studios
OTT Platform : Amazon Prime, 15-12-2023
-- అవ్యజ్ (శంకర్)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog