90's -A middle class bio pic



చాలా కాలం తర్వాత మిస్సమ్మ శివాజీ మెయిన్ రోల్ లో వచ్చిన చిత్రం ఈ 90's ఒక మిడిల్ క్లాస్ బయోపిక్. ETV Win app లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ ఫేం వాసుకి ఇందులో ప్రధాన పాత్ర పోషించినది.సాదా సీదాగా సాగిపోయే వెబ్ సిరీస్. శివాజీ ప్రభుత్వ టీచర్, వాసుకి హౌస్ వైఫ్, కాగా వీరికి ముగ్గురు పిల్లలు సాధారణ జీవితం గడుపుతుంటారు. 90's లో మిడిల్ క్లాస్ బంధాలు ఆర్ధిక ఇబ్బందుల్లో పెరిగే మనస్తత్వాలు ఎలా ఉంటయో అనేది చూపించారు. అక్కడక్కడా ఒకట్రెండు సన్నివేశాలు మినహా పెద్దగా చెప్పుకునేవేం లేవు. అలా సాగిపోతుందీ సిరీస్. అన్నీ అంశాలు తక్కువగానే ఉన్నాయీ. ఒకరిద్దరు మినహా పరిచయమున్న నటుల మధ్య సాగే సిరీస్ వీక్షణం. ఆదిత్యగా రోహన్ రాయ్ పాత్ర సూటిగా ఉంటుంది. 
-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog