మిస్ పర్ఫెక్ట్ / Miss perfect



లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలో ఫిబ్రవరి లో ఓ టి టి ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో ప్రదర్శిస్తున్నది మిస్ పెర్ఫక్ట్ సిరీస్. ఓ సి. డి. ఉన్న లావణ్య కన్ల్టెంసల్టెంట్ గా నటించింది. మొదటి భాగాలు కధలోని పాత్రల పరిచయం, చిన్నపాటి నటన హాస్యాలతో కొంత బోరింగ్ గా ఉన్నప్పటికీ చివరి భాగాలలో కూసంత హాస్యం మరియు ప్రేమ, ఎమోషన్స్ పండించారు. చివరి ఎపిసోడ్స్ లో కధంత రివీల్ అవ్వడం వలన కొంత ఆసక్తి ఏర్పడుతుంది. అప్పటివరకు నడిచేది నిదానంగా అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మాత్రమే నిజంగా ఉన్నాయి అనిపించాయి. లావణ్య తనకున్న క్లీన్ ఓ.సి.డి బలహీనత వలన మొదటి ప్రేమ విఫలం అయ్యి ఢిల్లీ నుండి కంపెనీ  పనిమీద హైదరాబాద్ కి రావడం తదుపరి అదే బలహీతతో అనుకోకుండా తను ప్రక్కనే ఉన్న అభిజిత్ ప్లాట్ లో పనిమనిషిగా మారి క్రమంగా రిలేషన్ లోకి వెళ్లడం దానిని ఎలా ముగించింది అనేది కధాంశం. అప్పటికే లావణ్య , రోహిత్ ప్లాట్స్ లో పనిమనిషిగా ఉంటున్న జ్యోతి (అభిజ్ఞ) వీరిద్దరి ప్రేమ కధని తెలుసుకునే పాత్రలో ముగింపు ఇస్తుంది. ఆసక్తులని వదులుకొని కెరీర్ పరంగా దొరికిన పని చేస్తూ సర్దుకుపోవడం ఎంతో కాలం నిలవదు అనే అంశాన్నిముగ్గురి జీవితాల్లో ప్రస్తావించారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్ గా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తిక్, వాచ్ మాన్ గా శ్రీను (హర్ష రోషన్ , మహేష్ విట్టా) లు రోహిత్, లావణ్యాల ప్రేమ గుట్టు విప్పే విషయానికి సహాయం చేయటం సిరీస్ ప్రధానాంశం అని చెప్పాలి. తక్కువ పాత్రలే ఉన్న నటనలో వాటికి న్యాయం చేసారు. హర్షవర్ధన్, ఝాన్సీల సహకార పాత్రలు కధకు పొడిగింపు కోసమే ఉన్నాయి. కొంచెం 
టైం పాస్ చేయొచ్చు, లాస్ట్ ఎపిసోడ్స్ వలన సిరీస్ పై ఆసక్తి ఉంటుంది.


డైరెక్టర్ :  విష్వక్ ఖండేరావ్  / Vishvak Khanderao

నిర్మాత : యార్లగడ్డ సుప్రియ / Supriya Yarlagadda 

సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి / Prashant R Vihari

సినిమాటోగ్రఫీ : జవ్వాది ఆదిత్య / Aditya Javvadi

ఎడిటర్ : రవితేజ గిరజాల / Ravi Teja Girijala

-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog