అథర్వ / Atharva

Ignored ? 

వచ్చిన ప్రతి సినిమా తప్పక చూసేవారు లేదా ఇదేదో కొత్త సినిమాల వుందే చూద్దాం అని యోచించే వాళ్ళని ఆకర్షించే సినిమా. OTT  ప్రైమ్ వీడియోలో కనిపించేలా ఉన్న సినిమా అథర్వ. నూతన దర్శకుడు, నటి నటులు, కధా నాయిక తప్ప మిగిలిన ఎక్కువ నిడివి గల పాత్రలు పెద్దగా పరిచయం లేనివారే. కధనంలో పట్టు వుంది, కధలో కొత్తదనం లేకపోయినా నడిపించిన తీరు బావుంది. చాలా సినిమాలలో వలెనే ఓ పోలిస్ అవ్వాలని ఆశ వున్న హీరో (కార్తీక్), తనకున్న రుగ్మత కారణంగా ఫిట్నెస్ లో ఫెయిల్ అయి ప్రత్యామ్నాయంగా క్రైమ్ ఈవెంట్ ఫోరెన్సిక్ క్లూస్ టీంలో ఉద్యోగిగా చేరుతాడు. ఆ తరువాత అక్కడ వున్న క్రైమ్ కేసులను పరిశీలిస్తున్న తనకి ఒక క్రైమ్ కేసు లో పరిచయం అయిన తన చిన్ననాటి వన్ సైడ్ ప్రేయసి హీరోయిన్ సిమ్రాన్ చౌదరి తో పరిచయం తన ద్వారా పరిచయం అయిన హీరోయిన్ ఫ్రెండ్ హత్య కేసుని ఏ విధంగా ఛేదించాడు, అందులో అసలు దోషి ఎవరు అనే అంశం మీద అల్లుకుంటూ కధ మొత్తం సాగుతుంది. సాదా సీదాగా సాగినా కధలో లీనం అయితే చూడటానికి ఆసక్తి వస్తుంది. సాధారణ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో లానే అనుమానపు పాత్రల మధ్య సాగుతూ కధ సుఖాంతం అవుతుంది. కొత్త దర్శకుడు అయినా ప్రయత్నం బావుంది. దర్శకత్వ లోటు పాట్లు మరువచ్చు. రొమాన్స్, సంగీతం, హాస్యంలకు చోటు లేదనే చెప్పాలి. హీరో కార్తీక్ నటనలో సరితూగినప్పటికి చూడటానికి అలవాటు పడాలి. ఆఖరి సన్నివేశంలో చూపినట్లు పార్ట్ - 2  వుంటుందా?

బలహీనతలు: హీరో, నూతన నటీనటులు, మ్యూజిక్ 
బలం: కథ , కధనం, నాయికలు, క్లోసింగ్ సన్నివేశం 

రచన, దర్శకత్వం :  మహేష్ రెడ్డి  / Mahesh Reddy ( రెండవ సినిమా)
నిర్మాత : సుభాష్ నూతలపాటి  / Subhash Nuthalapati
సంగీతం : శ్రీచరణ్ పాకల  / Sricharan Pakala
సినిమాటోగ్రఫీ : భాను రాజ్ కృష్ణ / Bhanu Raj krishna
ఎడిటర్ : ఉద్ధవ్  / SB Uddhav
నటనా వర్గం:    Karthik Raju,  Simran Choudhary, Ayraa, Arvind Krishna, Kabir Duhan Singh, Gagan Vihari, Anand
నిర్మాణ సంస్థ : Peggo Entertainments

-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog