భామాకలాపం / Bhamaa kalaapam-2

భామాకలాపం-2 


ప్రియమణి మెయిల్ రోల్ లో నటించిన సినిమా ఈ నెల 16 నుండి  ఆహా OTT లో స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే వార్త ఉంది. మొదటి పార్ట్ లో మాదిరి క్రైమ్ థ్రిల్లర్ కాకుండా ఈ 2 వ భాగంలో మొదటి భాగంలోని క్లైమాక్స్ ని అనుసంధానిస్తూ ఓ స్మగ్లింగ్ కధాంశంతో నడుస్తుంది. ప్రియమణి, శరణ్య ప్రతాప్ మొదటగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ మంచి ప్రచారం అవటంతో ఆ పేరుని చేర్చి " అనుపమ ఘుమఘుమలు" అని వచ్చేలా ఓ రెస్టారెంట్ ని ఏర్పాటు చేసి దాని ఆదాయంతో స్వయం స్వతంత్రంగా ఉండాలని ఆశిస్తుంది. ఈ మధ్యలో ఓ వంటల పోటీకి వెళ్లడం అక్కడ ఓ పేరు మోసిన బిజినెస్ మెన్ ఆంటోనీ లోబో(అనూజ్ గుర్వార) వంటలు కాంపిటేషన్ ముసుగులో స్మగ్లింగ్ చేయడం అలవాటుగా పెట్టుకుంటాడు. ఆ ముఠాలో అనుకోని కార్ ఆక్సిడెంట్ ద్వారా కలవడానికి వెళ్లిన పోలిస్ ఆఫీసర్ ప్రేరణతో తప్పని పరిస్థితుల్లో ఇరుక్కుంటుంది. దాని నుండి అనుపమ ఎలా బయటపడింది, ఆ స్మగ్లింగ్ ముఠాకి శరణ్య ప్రదీప్ తో కలిసి నిజంగా సహాయం చేసిందా అనేది 2గంటల నిడివి గల ఈ చిత్ర కధాంశం.అనుభవజ్ఞులు కనుక  ప్రియమణి, శరణ్య జంట నటన బావుందనే చెప్పాలి. అక్కడక్కడా వీరే హాస్యం పండించటానికి ప్రయత్నం చేసి కొద్దిగా విజయం సాధించారు. సీరత్ కపూర్ గ్లామర్ అదనపు అట్రాక్షన్ ఈ చిత్రానికి. నెగిటివ్ రోల్ చేసిన పాత్ర ధారులు ఇంకొంచం న్యాయం చేస్తే బావుండు అనిపించింది. మొత్తం మీద సో సో గా ఉందనిపిస్తుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. డైరెక్టర్ మొదటి, రెండు భాగాలలో కోడిగుడ్డు, కోడి వస్తువులుగా తీస్కొని కధని నడిపించటం తమాషా. పార్ట్ 1 ని చూసినవారు అయితే కొంచెం తక్కువ అంచనాలు చేసుకోవడం మంచిది. 

నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సందీప్ వేద్, అనూజ్ గుర్వార, రఘు ముఖర్జీ

దర్శకుడు : అభిమన్యు తడిమేటి
నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర
సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: దీపక్ యరగేర
ఎడిటింగ్: విప్లవ్ నైషదం
-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog