అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు / Ambajipet Mariage band

మరి అంబాజీపేటలో హీరో పెళ్లి బాజా మ్రోగిందా ? చూద్దాం. 

కలర్ ఫోటో నుండి భిన్నమైన పాత్రల ఎంపికతో  గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రం గత నెలలో వెండితెరపైన విడుదలయి మిక్స్డ్ టాక్ తో పాటు విమర్శకుల గుర్తింపు తెచ్చుకుంది. OTT platform ఆహా లో నిన్న (1 మార్చ్ ) విడుదలయ్యి ott లో కూడా దూసుకుపోతోందని చెప్పవచ్చు. మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ షార్ట్ ఫిలిం ఫేమ్ శివాని నగరం కథానాయికగా నూతన పరిచయంలో వచ్చిన ఈ సినిమాకి కధనం మంచి చేసింది. ఓ బ్యాండు మేళం వృత్తిలో ఉన్నబార్బర్ కొడుకు  హీరో మల్లికార్జున్, అదే వూరిలో ఉండే ఓ మోతుబరి వడ్డీ వ్యాపారి చెల్లెల్ని ప్రేమించటంతో అసలు కధ మొదలవుతుంది. మొదట కొంత భాగం నిదానంగా నడిచినా కధలో లీనం అవ్వచ్చు. సాధారణ ప్రేమ కధాంశానికి ఆడపిల్ల ఆత్మాభిమానం జోడించి ఆ వ్యాపారి కి ఎలా బుద్ధి చెప్తారు అనేది మంచి క్లైమాక్స్. ప్రేమకధ సుఖాంతం కాకపోయినా ఎమోషన్స్, ప్రేమలు, హాస్యం బాగానే పండాయి. హీరోయిన్ ని అనువైన పాత్రకి పరిమితం చేసి డైరెక్టర్ దుశ్యంత్ తెలివిగా వ్యవహరించినట్టుంది. కవలలు ఐన శరణ్య ప్రదీప్, సుహాస్ ల నటన బావుంది. పాత్రకి ప్రాధాన్యం ఇచ్చి శరణ్య కొంచం సాహసమె చేసింది. శివాని నగరం ఫ్రెష్, ఇన్నోసెంట్ లుక్స్ బావుంటాయి. హీరోయిన్ వాయిస్ ఓవర్ కొంచం చూసుకొనుంటే బావుండేమో అనిపించింది. బాక్గ్రౌండ్ లో నడిచే సిట్యుయేషన్ సాంగ్స్ బాగానే నప్పాయి. ఆర్టిస్టిక్ హీరోయిజం కోసం వేసిన సెట్టింగులు తక్కువనే చెప్పాలి. 

రచన, దర్శకత్వం: దుశ్యంత్/ Dushyanth Katikineni 
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్ / Wajid Baig 
సంగీతం: శేఖర్ చంద్ర / Sekhar Chandra 
కళా దర్శకత్వం: ఆశిష్ తేజ / Ashish Teja Pulala 
కొరియోగ్రఫీ: మొయిన్ మాస్టర్/ Moin Master 
నిర్మాత: మొగిలినేని ధీరజ్, బన్నీ వ్యాస్/  Dheeraj Mogilineni, Bunny Vyaas  

-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog