ఈగల్ " EAGLE "


గత నెలలో ధియేటర్స్ లో వచ్చిన ఈ రవితేజ చిత్రం పెద్ద ఆదరణ పొందలేదు. మార్చ్ 1 నుండి OTT platform అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నది. వరుస పరాజయాలతో ఉన్న రవితేజ కు ఈ చిత్రం కాస్త ఊరట అనే చెప్పాలి. కధ, కథనం బావున్నా ఎడిటర్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ప్రయోగం ప్రథమార్ధంలో కొంచం విఫలం అయినా తరువాతి నుండి ఆకట్టుకుంది. ఓ కాటన్ పరిశ్రమ గురించి జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వరన్ ప్రచురణ చేసిన న్యూస్ ఆర్టికల్ తో కధ ప్రారంభం అయి ఆ బ్రాండ్ వెనుక వున్న అసలు వ్యక్తి గురించి తెలుసుకొనే ప్రయత్నంలో EAGLE స్పై గురించి చర్చ రావడం అలా కధ ప్రథమార్ధం నీరసంగా వున్నా రవితేజ గతం ఎపిసోడ్ నుండి సినిమా మంచి స్టైలిష్ గ తయారవుతుంది. "ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు ఐతే, అదే ఆయుధాన్ని వాడుకుని విధ్వంసాన్నీ ఆపేవాడు దేవుడు" అనే సారాంశంతో గతం మొత్తం సాగుతుంది. తన వృత్తి రీత్యా జరిగిన అనర్ధం మదిని కలిచివేసి, ఆ మార్పుని స్వాగతించి ప్రియురాలి కోసం భక్షకుడు రక్షకుడుగా మారటం చిత్రం యొక్క ప్రధాన ఉద్దేశము. అక్రమ ఆయుధాల రవాణా నియంత్రణపై గతంలో వచ్చిన చిత్రాలతో  పోలిస్తే ఇది కొంచం సృజనాత్మకంగా ఉంటుంది. రవితేజ ఎమోషన్ సీన్స్ బావుంటాయి. హీరోయిన్ కావ్య థప్పర్ పాత్ర కొంచం నిడివె ఉన్న ప్రాధాన్యం ఉంది. అనుపమ ఆసాంతం ఉంటూ కధని ముందుకు తీసుకువెళ్ళింది. సహదేవ్ వర్మ స్నేహితుని పాత్రలో నవదీప్  ఒదిగిపోయాడు.  మధుబాల, అవసరాల శ్రీనివాస్ RAW ఆఫీసర్స్ గా  రాణించారు. 

బలం: రవితేజ నటన, పోరాట సన్నివేశాలు, అమ్మవారి విగ్రహంతో పోరాట సన్నివేశం చిత్రానికి హైలైట్, స్వచ్ఛమైన సినిమాటోగ్రఫీ

బలహీనత:  ప్రథమార్ధంలో ఉన్న సన్నివేశాలు, పాత్రల అత్యుత్సాహం 
-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog