maa voori Polimera2

    పొలిమేర-2 

    తాంత్రిక డివోషనల్ నేపధ్యంతో వచ్చిన చిత్రం. సత్యం రాజేష్ ప్రధాన తాంత్రికునిగా వచ్చిన పొలిమేర 2 సస్పెన్స్ గానే ఉంటుంది. థ్రిల్లర్ అంటే అనుకోని మలుపులు చివరలో కధ వివరించేప్పుడు కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ లైటింగ్ క్వాలిటీ బావున్నాయి. పొలిమేర2 అదే మొదటి చిత్ర యూనిట్ తో తీసిన చిత్రం. తెలంగాణ జాస్తిపల్లి గ్రామ పొలిమేరలో జరిగిన చేతబడులు వంటి కధ నేపధ్యానికి నిధిని జోడించి తీసిన చిత్రం. ఓ ఫిక్షన్ చరిత్రతో కలగలిసిన చిత్రం. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, కామాక్షి బాసర్ల కుటుంబాల మధ్యనే కధ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. మొదటి, రెండవ భాగాల్లో కొన్ని సన్నివేశాలు రెండు భాగాలని కలిపేట్టు ఆడియన్స్ కి గుర్తుచేయటానికి యధాతధంగా వున్నాయి. కాన్స్టేబుల్ గా వున్న బాలాదిత్య (జంగయ్య) ఆ గ్రామంలో జరిగిన చావులకి తన అన్న కొమిరయ్య (సత్యం రాజేష్) కారణమేమో అని అనుమానంతో మొదటి భాగంలో మొదట్లో చనిపోయాడు అనుకున్న కొమరయ్య బ్రతికే వున్నాడు అని తెలుసుకుని ఆ కేసు చిక్కుముడి విప్పటానికి చేసే ప్రయత్నంతో సినిమా రెండవ భాగం కధ మొదలు అవుతుంది. తరువాత కేరళలో ఉన్న కొమరయ్యని అయ్యప్ప దీక్షకి వెళ్లిన బాల్జ ( గెటప్ శ్రీను ) కలవడంతో అసలు జరిగిన కధ మొత్తం ఓ కొలిక్కి వస్తుంది. ఎక్కువ కధలో ప్రధాన పాత్ర సత్యం రాజేష్ తో ఉంటుంది. మొదటిభాగంలో జరిగిన కధలోని అనుమానపు అంశాలన్నీ 2వ భాగంలో విపులంగా వివరించాడు డైరెక్టర్. ఈ కధలో ఓ తల్లిగ తన బిడ్డని చదువించుకోవాలి అనే తపన తెలియజేయడం, దానికోసం ఆమె తీసుకున్న నిర్ణయం చెప్పుకోదగినది. ఇక తంత్రం మూఢనమ్మకమా లేక నిజమా అనేది ఆడియన్స్ నమ్మకానికి వదిలేసాడు డైరెక్టర్. అసలంటూ ఏమి లేనపుడు వీటికి మూలం కధల్లో చూయించటానికి పూజ, విధి విధానాలు ఎక్కడినుండి వచ్చాయి అనేది ప్రశ్నార్ధకం. మంచిని ఆనుకునే చెడు కూడా ఉంటుంది అనేది నమ్మదగినది. కొమరయ్య ఎందుకు నర బలి చేసాడు అనేది, దానివల్ల అనుకున్న నిధి దొరికిందా అనేది పొలిమేర2 చిత్రం లో చూడాలి. స్క్రిప్ట్ పకడ్బందీ గానే ఉంది. కాకపోతే రెండు భాగాలూ చూసిన వారికే రెండో భాగంలో ఉన్న అతుకులు ఏమిటో ఇంకొంచం అర్ధం అయి కధ అర్ధవంతంగా అనిపిస్తుంది. నటుల అందరి పాత్రలు కధకి అనుసంధానమై ఉంటాయి. 

డైరెక్షన్ : అనిల్ విశ్వనాధ్ 
సినిమాటోగ్రఫీ: కుషేదర్ రమేష్ రెడ్డి 
బి జి ఎం :  గ్యాని 
నిర్మాత : గౌర్ కృష్ణ 
ఉత్పత్తి, నిర్మాణ సంస్థ : శ్రీ కృష్ణ క్రియేషన్స్
OTT Release Date : 2023-12-08, AHA Gold
-- 
అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog