Baak - Aranmanai-4

 బాక్ - అరన్ మనై-4 

Baak OTT movie Review

డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా అరణ్మణై - 4 తమిళ చిత్ర అనువాదంగా వచ్చిన చిత్రం  'బాక్ ' .  భయానక సన్నివేశాలతో నిర్మించిన చిత్రం. తమ్మన్న, రాశి ఖన్నాలు నటీమణులుగా, కోవై సరళ ప్రధాన సహాయ పాత్రలో నటించారు. కథవిషయానికి వస్తే సాధారణ ఇతివృత్తంతో ఓ తల్లి తన పిల్లల కోసం మరణించినా  కూడా ఆత్మగా చివరి వరకు ఎలా కాపాడుకుంది అనేది. తమన్నా తల్లి పాత్రలో మెప్పించింది. ప్రథమార్ధం  పరిచయాలు కథను అల్లుతూ సస్పెన్స్  దృశ్యాలతో నడిచింది. ద్వితీయార్ధం లో యుద్ధ సన్నివేశాలు గ్రాఫిక్ మాయాజాలం తో నడిచింది. ఓ గ్రామ చరిత్రలో జరిగిన భయానక సంఘటనలు మరల పునరావృతం అవడం ఆ సంఘటనల నుండి తమన్నా వాళ్ళ కుటుంబం దైవ శక్తి సహాయంతో ఎలా రక్షింపబడింది   అనేది పూర్తి కధ. తమన్నా  ఆత్మగా మారి యుద్ధం చేయడం ప్రధాన అంశం. 

నటీనటులు: సుందర్. సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు 
దర్శకుడు: సుందర్. సి 
నిర్మాత: ఖుష్బూ సుందర్ 
సంగీత దర్శకుడు: హిప్ హాప్ తమిళా 
సినిమాటోగ్రఫీ: ఇ.కృష్ణసామి 
ఎడిటింగ్: ఫెన్నీ ఆలివర్

బలం: ఛాయాగ్రహణం , దృశ్య వీచికలు (విజువల్స్), ధ్వని ప్రభావాలు, 
బలహీనత : కధ, నటుడు-దర్శకుడు,  ఆటవిడుపు గ మధ్య మధ్యలో వచ్చిన పూర్తిగా మెప్పించలేని హాస్యం.
-- అవ్యజ్ (శంకర్) 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.

Search This Blog