Gam.Gam..Ganesha

గం.. గం.. గణేశా

GamGamGanesha Review

 ఆనంద్ దేవరకొండ, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మానుయేలు స్నేహితులుగా గత నెల విడుదలయి జూన్ 20 నుండి  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రం.  చిన్న చితక దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతున్న హీరో, తన స్నేహితుడు కలిసి ఓ భారీ దొంగతనానికి ప్లాన్ వేసి సెట్టిల్ అయిపోవాలని నిర్ణయం తీసుకొంటారు. అందులో భాగంగా ఓ పెద్ద నగలవ్యాపారి కుమారుడితో వజ్రాల దొంగతనానికి డీల్ కుదుర్చుకుంటారు. ఇంతలో లోకల్ రాజకీయ నాయకుడు ఓట్ల కోసం తెచ్చుకున్న పార్టీ ఫండ్ కి కూడా ప్లాన్ ఉండటం గందరగోళంకి దారితీస్తుంది. వీరిద్దరి బ్యాచ్ లు కలిసి ఓ గ్రామానికి చేరడం అక్కడ జరిగే సన్నివేశాలు కలిసి కధని నడిపిస్తాయి. ఆ వజ్రం ఎక్కడ వుంది అనేది దానితో పాటు ఈ వందకోట్లు కోసం జరిగే వెతుకులాట మధ్య సాగుతుంది. అదే ఈ చిత్ర టైటిల్ కి సంబంధం ఉండేలా తయారుచేసుకున్నారు దర్శకుడు. పెద్ద ఆర్భాటం ఏమి లేకుండా సాదాసీదాగా సాగినట్లుంటుంది.  హాస్యం తక్కువే.. భావోద్వేగం తక్కువే. 

నటవర్గం: Anand Deverakonda, Pragati Srivastava, Nayan Sarika, Emmanuel, Vennela Kishore, Satyam Rajesh
దర్శకత్వం, రచన : Uday Shetty
సంగీతం : Cheitan Bharadwaz 
నిర్మాతలు : Vamsi Krishna Karumanchi , Anurag Paravatheneni, Kedar Selagamsetty
-- అవ్యజ్ (శంకర్)  2**/5****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog