KaLkI 2898-AD

కల్కి 2898 AD


" అశ్వర్దామ హతః కుంజరః " అనే స్లోగన్ తో మొదలైన ఈ చిత్రం భారీ అంచనాలని అందుకుంటుందా అని ఆలోచన సినిమా  పూర్తిగా చూసేలా ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. కధ - పదా చూద్దాం అనిపించినంత నిజంగా వుందా అనేది ప్రశ్నార్ధకం అయ్యింది.? అనుమానమే లేదు ఎంచుకున్న కధ, చూసిన, చదివిన చిత్ర సమీక్షలు సమీక్షకుల ఓపికకి ధన్యవాదాలు చెప్పచ్చు. ప్రభాస్, దేహదారుఢ్యానికి తగిన సినిమాలే తప్ప ఇంకా గతంలో వచ్చిన ఛత్రపతి లాంటి భారీ విజయం పొందిన మంచి చిత్రాన్ని, ఆ రోజులు మళ్లి చూడగలమా అనిపించింది. అనుమానమే లేకుండా ఛాయాగ్రహణం, భారీ అలంకరణలు, పేరున్న నటీనటులు, అంచనాలకు అందని కృత్రిమ దృశ్య కళ, అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు ఇవన్నీ ఈ సాంకేతిక రంగంలో ఎంతో ఆసక్తిగ, నైపుణ్యంగా పూర్తిగా వాడుకున్నాడనే చెప్పవచ్చు దర్శకుడు ప్రశాంత్ నీల్. కాకపోతే ఈ కధని రాబోయే కల్కిని రక్షించటానికా అన్నట్టు అర్దాంతరంగా ముగించినట్టే ఉంది. హాస్యం పండించిన ప్రభాస్ ని ఆలా చూడాలి అనుకోలేదు. మొదటి భాగం మొత్తం సృష్టి అంతంలో పూర్తిగా నాశనం అవగా మిగిలిన కాశి పట్టణం, దేవుడి పుట్టుకని ఆపాలని ఎదురుచూసే కలి పురుషుడిగా సుప్రీమ్, తన సైన్యం, తన క్యాంపస్, దేవుని పుట్టుకకు కారణం అవుతుంది అనుకున్న శంబాలా నగరం వెతుకులాటల మధ్యనే తిరుగుతుంది. కాస్త రెండవ భాగం మాత్రం కొద్దిగా భావోద్వేగం కలిపి ఉంటుంది. మొత్తానికి చూడటానికి ఓపిక, అర్ధం చేసుకోటానికి సహనం కావాలి అనిపించింది. ఇకపోతే కలియుగాంతంలో ఉండే అనావృష్టికి ఊహకి ప్రతీకగా చిత్రం మొత్తం ప్రతికూల వాతావరణం, చిత్రీకరణ పసుపు వర్ణంలో ఉండటం వెండితెరపైన చూడటానికి కొంచం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మొత్తంగా అధునాతన కృత్రిమ దృశ్యాలు (గ్రాఫిక్స్) ఆదిపురుష్ చిత్రాన్ని , ఆ సంభాషణలు, నవ్వులు అక్కడక్కడా గత కాలంలో వచ్చిన పేరున్న లక్ష్మీగణపతి ఫిలిమ్స్ " సముద్రపు దొంగలు" వంటి హాలీవుడ్ చిత్రాల అనుకరణని గుర్తుచేశాయి. కేవలం కృత్రిమ దృశ్యాలతో అద్భుతంగ చిత్రాన్ని నడిపించాడే తప్ప, తెలుగు మాతృక విస్మరించాడు. రాజమౌళి పుణ్యమా అని ఓ మెట్టు ఎదిగి చట్రంలో ఇరుక్కుపోయిన ప్రభాస్ లో మళ్ళి పాత డార్లింగ్ గా మనసుని హత్తుకునే  ప్రభాస్ ని చూడటానికి వేచి చూడాలి. 
*** కృత్రిమ , సాంకేతిక, దృశ్యాలు చూడటానికి వెళ్ళవలసిన చిత్రం ***
-- అవ్యజ్ (శంకర్)  2**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog