Satyabhama

కాజల్ అగర్వాల్ in & As " సత్యభామ" 


కాజల్ అగర్వాల్ డైనమిక్ పోలిస్ గా వచ్చిన లేడి ఓరియంటెడ్  చిత్రం. రక్షక భటురాలుగా విధులు నిర్వహిస్తున్న కాజల్ దగ్గరికి హసీనా అనే అమ్మాయి గృహహింస సమస్యతో రావటంతో, తనని రక్షిస్తా అని హామీ ఇవ్వటం, ఆ హామీ నెరవేర్చలేక, గర్భవతిగా ఉన్న తనని కోల్పోవటంతో కధ మొదలవుతుంది. హసీనాని చంపిన మోసగాడు, పచ్చబొట్టు వేసే 'యదు'ని పట్టుకొనే ప్రయత్నంలో కలిగే మలుపులు, ఆ నేర పరిశోధనలో చిక్కు ముడులు విడతీసే దారిలో టెర్రరిస్ట్ మూకలు, ఉమెన్ ట్రాఫికింగ్ వంటి వాటిని ఛేదిస్తు కధ సుఖాంతం అవుతుంది. 'యదు' ని పట్టుకునె సమయానికి జరిగిన అసహజ ఆటంకం, దాని వెనుక ఉన్న వారిని ఎలా మార్చింది అన్నదే కధనం. 
నటీనటులు : కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, నాగినీడు, హర్షవర్ధన్,  ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం: సుమన్ చిక్కాల
ott platform: అమెజాన్ ప్రైమ్ 
-- అవ్యజ్ (శంకర్) 2.25**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog