Tenant

 Tenants తో ఏం జరుగవచ్చు?


సత్యం రాజేష్ కథానాయకుడుగా వచ్చిన చిత్రం ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నది. ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సాధారణ టాక్ ని సొంతం చేసుకుంది. జూన్ 7న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం  ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం. చిత్రం రాజేష్ కథానాయకుడుగా ఉన్నా యి చిత్రం తను ఒక శవాన్ని కారులో నుండి తీసి దహనం చేసే సన్నివేశంతో మొదలవుతుంది. అక్కడ నుంచి తను చంపింది ఎవరిని అనే కోణంలో పరిశీలించడానికి వచ్చిన ఎస్తర్ పోలీస్ ఆఫీసర్ గ జరిపే విచారణ బ్యాక్ గ్రౌండ్లో కథ మొత్తాన్ని ప్రేక్షకుడికి తెలియచెప్తుంది. మేఘా చౌదరిని పెళ్లి చేసుకున్న సత్యం రాజేష్ క్రొత్తగా సిటీలో తన కుటుంబాన్ని కుటుంబ జీవితాన్ని మొదలుపెడతాడు. పల్లెటూరు నుంచి రావడంతో మేఘ చౌదరి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది ఈ చిత్ర ప్రధాన అంశం కొంచెం ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చిత్రీకరించిన సన్నివేశాలు ఉన్నాయి. ఓ ప్రేమ జంట పెద్దలను ఒప్పించి సిటీకి రావడము వారు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ఆ సమస్యలకి ఈ కథానాయకుడికి మధ్య ఉన్న బంధం ఏమిటి అనేదాన్ని చిత్రం ఆశాంతము చూపించే ప్రయత్నం చేశారు. మేఘా చౌదరి అందము అభినయము కొంతవరకు పర్వాలేదు అనిపిస్తాయి. చందనా పయ్యావుల తన ప్రేమికుడుతో పాటు సిటీకి వచ్చి మోసపోయి ప్రాణం విడుస్తుంది దానిని అంటుకొని కథానాయకుడు చేసిన శవ దహనానికి కల సంబంధం ఏమిటి అనేది ఎస్తర్ నేర పరిశోధనలో విపులీకరించబడుతుంది. మొత్తం మీద పరవాలేదు అనిపించే ఈ చిత్రం ఒక సమాజానికి అవసరమైన సందేశాన్ని చెప్పకనే చెప్పింది అనవచ్చు.
Starring: Satyam Rajesh, Megha Chowdhury, Chandana Payyavula, Bharath Kanth, Esther, Aadukalam Naren, Chandu

Director: Y Yungandhar
Producers: Mogulla Chandrashekhar Reddy
Music Director: Sahitya Sagar
Cinematographer: Jemin Jom Ayyaneth
Editor: Vijay Mukthavarapu

-- అవ్యజ్ (శంకర్) 2.4**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog