Love me ....If you Dare

 దయ్యంతో ప్రేమ ఎలా ఉంటుంది.. ?



అర్జున్ ఓ ఆస్తిక శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. ఎందుకంటె దయ్యాలు , ఆత్మలు అంటే నమ్మకం లేకుండా నిజ నిర్ధారణలు చేస్తూ ఆ నమ్మకాల్ని గౌరవిస్తూ ఉంటాడు, తను తన తనతోపాటు అన్నల చూసుకొనే  స్నేహితుడు ప్రతాప్ నడుపుతున్న యూట్యూబ్ ద్వారా ప్రజలని చైతన్యం చేస్తుంటాడు. ఇలాంటి సన్నివేశంతో కధ మొదలవుతుంది.  అలాంటి అర్జున్ దివ్యవతి ఆత్మహత్యోదంతం సవాలుగా తీసుకొని, ఓ పాడుబడిన ఇంటిలో దివ్యవతి ఉంటుంది, చూసిన అందరిని చంపుతుంది అని అందరు అనుకుంటున్న ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటిలో జరిగే సన్నివేశాలు చిత్రీకరణ ఆలోచనతో భయంగా అనిపించేలా ప్రయత్నమ్ చేసారు. కీరవాణి సంకలనం చేసిన ధ్వని ప్రభావాలు బావుంటాయి. ఆ ఇంటిలో తనతో మాట్లాడిన కనిపించిన దివ్యవతి బ్రతికే వుంది అని బలంగా నమ్ముతున్న అర్జున్ కి దివ్యవతి మరణించినట్టు అన్నయ్య ప్రతాప్, తన స్నేహితులు ప్రియా (వైష్ణవి చైతన్య), పింకీ (సిమ్రాన్ చౌదరి) ల ద్వారా నిరూపణ అవుతుంది. ద్వితీయార్ధంలో, ప్రతాప్ వెతికిపెట్టిన కనపడకుండా పోయిన అమ్మాయిలలో దివ్యవతి ఉంది అని తెలుసుకొటమే కధ సారాంశం. సరిగా గమనిస్తే విరామ సమయంలోనే ప్రేక్షకులకి దివ్యవతి పాత్ర ఎవరో అని దర్శకుడు చెప్పకనే చెప్తాడు. తరువాత సన్నివేశాలు వాటిని నిజం చేయటానికి జరుగుతున్నవి, జరిగిన కధ దివ్యవతి వివరంగా చెప్తుంది. చిన్న చిన్న సన్నివేశాలు తికమక పెట్టినా ప్రేక్షకుడికి చివరికి తీరిపోతాయి. భావోద్వేగ సన్నివేశాలు కొంచమే అయినా బావున్నాయి. కధలో ప్రధానమైన మలుపులు ఆకట్టుకున్నాయి. ఓ ప్రేమకి అర్ధం చెప్పే ఓడిపోయిన ప్రేమికుడిగా ఆఖరులో ఇచ్చిన మలుపు అనిర్వచనీయం. చిత్రాన్ని కాస్త మనసుపెట్టి లీనమయి చూడాలి. కష్టపడి కథని సుఖాంతం చేసాడు దర్శకుడు అరుణ్ భీమవరపు అనుకునే లోపు ప్రశ్నార్ధకాన్ని ( KILL ME ...if You LOVE )
మిగిల్చి శుభం కార్డు వేసాడు.. 
నటవర్గం : Ashish Reddy, Rajeev Kanakala (అతిధి పాత్రలో) , Simran Choudhary, Vaishnavi Chaitanya, Ravi  krishna 
సంగీతం: ఎం. ఎం. కీరవాణి 
సినిమాటోగ్రఫీ: పి.సి. శ్రీరామ్ 
నిర్మాణసంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్ 
కధా రచన , దర్శకుడు:  అరుణ్ భీమవరపు
OTT  ప్లాటుఫార్మ్ :  అమెజాన్ ప్రైమ్ 
-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog