Yakshini

'యక్షిణి' ఓటమి పాలయిందా?


వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్ నట త్రయంలో డిస్నీ హాట్ స్టార్ వేదికగా వచ్చిన చిత్రం. జూన్ 14 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. యక్షిణి లోకం నుండి వచ్చిన మాయ (వేదిక) ఇక్కడి గుప్త ఆలయానికి కాపలాగా ఉన్నసమయంలో భయానికి, మంత్రం శక్తికి గెలుపు  సాధ్యం కాదు అని తెల్సుకున్న తాంత్రికుడు మహాకాల్ ఆ అలకానగరంని వశం చేసుకోవాలి అని ప్రేమ పేరుతో మాయని బంధించి  కుబేరుని శాపానికి, యక్షిణిలోకానికి దూరం చేస్తాడు.యక్షరాజు చెప్పిన శాపవిమోచనం కోసం తపిస్తున్న మాయ, (కృష్ణ) రాహుల్ ని కలుస్తుంది. ఆ ప్రయత్నంలో నిజమైన ప్రేమకు దగ్గరైతుంది. ఆరంభంలో పాత్రలు పరిచయం అయ్యాక రెండవ భాగం నుండి వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మహాకాల్ మరియు మాయల మధ్య సన్నివేశాలు బావున్నాయి. తాంత్రిక విధానంలో ఉన్న గుప్త ప్రయోగాలు యక్షిణి ఆలోచనలు, తంత్ర గురువుల ఆవేశకాలోచనలు, మంత్రం బలం లాంటి రహస్యాలు చక్కగానే ఉంటాయి. కాస్త నిజమైన సమాచారం బాగానే అందించారు. అనుకోని అతిధి జ్వాలాముఖిగా మంచు లక్ష్మి రావటం కధలో మలుపు. మాయ - జ్వాలాముఖిల మధ్య ఆధిపత్య పోరులో జరిగే సన్నివేశాలు బావుంటాయి. కళాత్మక సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, ధ్వని ప్రభావాలు అద్భుతంగ పనిచేసాయి. మహాకాల్ గుప్త ఆలయం తద్వారా అల్కపురిని సొంతం చేసుకొని తన గురువును చంపిన యక్షిణి లోకం పైన  పగ తీర్చుకోవాలని ఆఖరు ప్రయత్నంలో ప్రేమించిన రాహుల్ స్వయంగా యక్షిణికి సహాయపడి మాయని శాపం నుండి విముక్తుడ్ని చేసి తన నగరానికి వెళ్లేలా సహకరించటంతో కధ ముగుస్తుంది. హృదయానికి హత్తుకొనే సన్నివేశాలు అక్కడక్కడా ఉన్నాయి. హాస్యం ఒక పావలా, ఆలోచన ఆవేశం అర్ధరూపాయి, కళాత్మకం ముప్పావు వంతు , కధ ఓ పావలా వంతు మొత్తం కలిపి 150 కి మించి ఉంటుంది. పాత్రలకు న్యాయం చేసారు. వేదిక పాత్ర కి న్యాయం చేసినా, యక్షిణి అంతకన్నా అందంగానే  ఉంటారుగా మరి అనిపించింది. 

నటులు: Rahul Vijay, Vedhika, Manchi Lakshmi , Ajay తదితరులు (సాధారణ బలం) 

దర్శకులు : Teja Marni (బలహీనమైన బలం)

నిర్మాతలు : Shobu Yarlagadda ,Prasad Devineni (దేవుళ్ళు)

సంగీతం : Priyadarshan Balasubramanian 

ఛాయాగ్రహణం,  : Jagadeesh Cheekati (బలం )

కత్తిరింపు (ఎడిటింగ్) : Karthikeyan Rohini (బలహీనం, బలం)
-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog