అల్లరి నరేష్ - ఆ ఒక్కటి అడక్కు / Aa okkati adakku

 అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు 


ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రం పేరుతో వచ్చిన పాత రాజేంద్ర ప్రసాద్ హాస్య చిత్రంతో పోలిక లేకపోయినా అక్కడక్కడా కాస్త హాస్యం మొదటిలో ఉండి తర్వాత ఎమోషనల్ డ్రామాకి చేరువ చేస్తుంది. మొత్తం ఈ రోజుల్లో వివాహం కాని జంటల మనోవేదనలతో ఆడుకుంటున్న వివాహ వేదికల మోసాలను ఎత్తిచూపుతూ కట్టడి చేసే ప్రయత్నంకి కుటుంబాల భావావేశాలని జోడించి సాగుతుంది. వెన్నెల కిశోర్ , ఫరియా అబ్దుల్లా, హరితేజ, అరియనా గ్లోరీ వంటి తెలిసిన నటీనటుల అభినయాలతో ముందుకు సాగుతుంది. వివాహవేదికలో పనిచేసే ఫరియా అబ్దుల్లా (సిద్డి), హరితేజల్ని గణపతి (నరేష్) కలుస్తాడు. వాళ్ళ బృందం చేసే వ్యాపార మోసంలో భాగంగా వారిద్దరూ ప్రేమిచుకోవడం, ఓ వివాహం అనే ఆచారంతో ముడిపడిన భారతీయ కుటుంబ వ్యవస్థ వీళ్ళ వివాహ వేదికల మోసాల వలన వస్తున్న పర్యవసానాలు తెలుసుకొని, వారు చేసే మోసాల్ని కథా నాయకుడు కూడా తెలుసుకొనే సమయానికి మనసు మార్చుకున్న సిద్ధి బృందం పశ్చాత్తాపంతో లొంగిపోవటంతో కధ సుఖాంతం అవుతుంది. మొత్తమ్మీద కొంచం నిజాయితీ, కొంచం మోసం భిన్న సన్నివేశాలతో జరుగుతున్న సంఘర్షణల మధ్య భావావేశం కలిసిన చిత్రం. 
దర్శకత్వం  Malli Ankam 
సంభాషణలు  Abburi Ravi 
సినిమాటోగ్రఫీ  Suryaa 
ఎడిటర్  Chota K Prasad 
సంగీతం  Gopi Sundar 
నిర్మాత  Rajiv Chilaka 
నిర్మాణసంస్థ  Chilaka Productions
ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ 
-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog