Music shop murthy - OTT Review

 మ్యూజిక్ షాప్ మూర్తి 


జయ్ ఘోష్, ఆమని జంటగా చాందిని చౌదరి , భాను చందర్ మొదలైన వారు ప్రధాన తారాగణంగా ఈ నెల 17 న  ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓ.టి.టి. లో విడుదలైనది. ఓ పల్లెటూరు లో ఉంటున్న మూర్తికి క్యాసెట్ షాప్ ఉంది. అందులో పాత పాటల కాస్సెట్స్ అమ్ముతూ ఊరిలోని చిన్న చిన్న శుభకార్యాలకు సౌండ్ సిస్టమ్స్ అందిస్తూ జేబు నింపుకుంటూ జీవనము గడుపుతుంటాడు. అలా ఆ వూరిలో జరిగిన ఓ శుభకార్యంలో మూర్తి చేసిన సంగీత విభావరిలో ముగ్ధులైన అక్కడి ప్రేక్షకులు, జనం ఇచ్చిన ఆలోచన, మూర్తిని డి.జె. వృత్తిలో ఎలాగైనా స్థిరపడాలి అని కోరిక బలంగా రేకెత్తిస్తుంది. కుటుంబ పోషణ భారం కూడా తీరుతుంది అనే కోరిక బలంగా నాటుకోవడంతో అటువైపుగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టాలి అనుకొంటాడు. అడుగడుగునా వయోభారం మరియు పల్లెటూరి నేపధ్యం, కుటుంబ బాధ్యతలు నెగ్గుగుకుని ఎలా డి.జె. మాస్టర్ గా స్థిరపడుతాడు అనేది కధాంశం. ఇందులో మూర్తికి ట్రైనర్ గ చాందిని చౌదరి (అంజనా) ఎదురుపడటం ఓ సహకారం అందించడం కథను ముందుకు నడిపాయి. భానుచందర్ కూతురిగా తన కలను నెరవేర్చుకోలేని స్థితిలో ఉన్న అంజనా సహకారం ఎలా కధని మలుపు తిప్పింది, వారిద్దరి మధ్య మరియు విరామం తరువాతి భాగం బాగా భావొద్వేకంతో ఉంటుంది. ఇక్కడ వయసు ఒక సంఖ్య మాత్రమే అని, చేయాలనుకునే వృత్తికి, పిల్లలు, మనిషి తన కలను నెరేవేర్చుకునే ప్రయత్నానికి కాదు ( కే.ఎఫ్.సి. స్థాపకుడు కూడా తన వృద్ధాప్యంలోనే సంస్థని మొదలు పెట్టినట్టు చదివాం ) అని నిరూపించు కోవడం ముగింపు. రెండవ భాగంలో భావోద్వేగం బాగానే పండింది. అజయ్ ఘోష్ నటన బావుంది. ఆమని కూడా భార్యగా సమంగా ఉద్వేగాన్ని పండించారు. సంగీతంలో ఓ పాట బావుంది. కధకు తగిన సంగీతం అనిపించింది. మొత్తానికి ఇది ఇప్పటి తరానికి ఓ కెరీర్ ఓరియెంటెడ్ సందేశం కలిగిన చిత్రం. అసాధ్యం కానిది ఏమి ఉండదు అని, కొంచం అదృష్టం కూడా తోడ్పాటు ఇవ్వాలి అని చెప్పకనే చెప్పారు. 


దర్శకుడు:  శివ పాలడుగు 

నిర్మాతలు :  హర్ష గారపాటి , రంగారావు గారపాటి 

సంగీతం: పవన్ 

ఛాయాగ్రహణం: శ్రీనివాస్ బెజుగం 

కత్తిరింపు : బొంతల నాగేశ్వర రెడ్డి 

ఓ.టి.టి. : ఈటివి విన్ / అమెజాన్ ప్రైమ్ 

-- అవ్యజ్ (శంకర్) 3***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog