Brinda - బృంద

 బృంద- సోనీలివ్ ఒరిజినల్ 

త్రిష ప్రధాన పాత్రలో 8 భాగాలతో వచ్చిన క్రైమ్ సస్పెన్స్ వెబ్ సిరీస్ బృంద. ఓ అనాగరిక సమాజం గిరిజన తాండాలో ఉన్న చిన్న పిల్లగా మొదటి ఎపిసోడ్ లో పరిచయం అవుతుంది. అక్కడ తనపైన జరిగే నరబలి మూఢ విశ్వాసం నుండి తప్పించుకుని ఆమని - జయప్రకాశ్ ఇన్స్పెక్టర్ దంపతులకు దొరికిన అమ్మాయి తరువాత బృంద (త్రిష)గా రెండవ భాగం నుండి బాధ్యతలు స్వీకరిస్తుంది. సహజంగానే నాయకి కనుక తన రక్షక భటనిలయానికి వచ్చిన ఓ కేసు యొక్క ఆధారాలను వెతికి సేకరించి, అదే కేసు పురోగతికోసం నెలలలోనే ప్రత్యేక విచారణ బృందం (SIT)లో నియమింపబడుతుంది. మూడవ భాగంలో ఆ కేసు విచారణ ఓ వైపు జరుగుతూ ఉండగా కిల్లర్ ఎవరు అనేది ప్రేక్షకులకి బహిర్గతం అవుతుంది. కానీ తరువాత నాలుగవ భాగంలో ఓ ప్రముఖ సంఘసంస్కర్త ఆనంద్ (Indrajith Sukumaran) అనుమానాస్పదంగ అనిపించటం వాళ్ళ నాన్నగారి హత్య ఇలాంటివి మలుపులు. తర్వాతి కధ ఎలా ముందుకు వెళ్తుంది, అనుకున్న వారే కిల్లరా లేక వేరే ఎవరైననా, అసలు కిల్లర్ ని పట్ట్టుకున్నారా అనేవి సిరీస్ లో చూడవలసిన అంశాలు. ఈ సిరీస్ మూడవ ఎపిసోడ్ నుండి మలుపులతో ఆసక్తిగ ఉంటుంది. కధలో ఎక్కడ అనవసరం అనే అంశాలు కనిపించలేదు ఆటవిడుపు దృశ్యాలు తప్ప. కధనం బావుంది. స్క్రిప్ట్ పైన పని బాగా జరిగింది.  మొదటి ఎపిసోడ్ లో మొదలు  పెట్టిన దేవత-భక్తుల అంధ విశ్వాసం, వ్యక్తి లేదా సమాజం పైన దాని ప్రభావం అనే అంశాలకి హత్యోదంతం కలిపి కధని నడిపించారు. త్రిష నటన బావుంది. కాకపోతే ఇందులో త్రిష ఓ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా మాత్రం కన్పించదు, సిరీస్ మొత్తం త్రిష ఆలోచనలతో వన్-వుమన్ ఆర్మీలాగా నడిపించినట్టు ఉంటుంది. ఈ మధ్య తరచు కనిపిస్తున్న నటుడు రవీంద్రవిజయ్ సహాయ నటుడి పాత్రలకి పెరుగుతున్న ఆదరణ. ప్రతి ఏపిసోడ్ మొదట్లో వచ్చే బాక్గ్రౌండ్ టైటిల్ సాంగ్ బావుంది.
నటవర్గంTrisha Krishnan as Brinda, Indrajith Sukumaran, Jayaprakash (Tamil Actor), Ravindra Vijay, Amani, Anand Sami, Rakendu Mouli

దర్శకత్వంSurya Manoj Vangala
సంభాషణలు : Jay Krishna
సినిమాటోగ్రఫీ : Dinesh K Babu
సంగీతం : Shakti Kanth Karthik
నిర్మాత : Ashish Kolla
ఓ. టి. టి. ప్లాట్ ఫార్మ్ : Sony Liv
ఓ.టి. టి. విడుదల :  2024-08-02 
స్టంట్స్ , కొరియోగ్రఫీ : Chetan D Souza
విజువల్ ఎఫెక్ట్స్ :  Srikanth Sakhamuri
ఒక్క మాటలో : దేవుడు - మూఢ నమ్మకం ముసుగులో పబ్బం గడుపుతున్న ఒకరిద్దరు వివిధ 
మతాల పెద్దల వలన ఓ అమాయకుడు నేరస్తుడుగా మారి, తాను సమాజంలో చేసే హత్య - హింసే శాశ్వత పరిష్కారం అనుకున్న మనస్తత్వంకి స్వస్తి పలకడం. 

-- అవ్యజ్ (శంకర్) 3***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog