Payal rajputs' Rakshana - రక్షణ

రక్షణ-పాయల్ రాజ్ పుత్

పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ గా లీడ్ రోల్ లో నటిస్తూ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రం రక్షణ. పోలిస్ అవ్వాలని లక్ష్యంతో ఏ.సి.పి అయ్యాక నిత్యం చేసే విధి నిర్వహణ చేస్తున్నప్పటికీ, గతంలో తన స్నేహితురాలి (ప్రియా) ఆత్మహత్య కేసుని గుర్తు చేసుకుంటూ ఆ నిందితుడిని పట్టుకోలేకపోయాం అనే న్యూనతతో పాటు విమెన్ ట్రాఫికింగ్ సమస్యని ఛేదించాలని కధాంశంతో రూపొందింది. ఆ సమస్యలో భాగంగా పోలీస్ ఆఫిసర్ గా తనకు కూడా వచ్చిన అదే టీజింగ్ సమస్యను ఛేదించే ప్రయత్నంలో పూర్వం తాను వార్నింగ్ ఇచ్చిన అరుణ్ ని అరెస్ట్ చేయాలి అని చూస్తుంది. అది కుదరక అరుణ్ అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతూ తన పేరును కారణంగా చూపడం మలుపు. అరుణ్ ఆత్మహత్య వెనుక ఎవరో వేరే వ్యక్తి ఉన్నారని, అతనే గతంలో తన స్నేహితురాలిని కూడా చంపి ఉంటాడని గట్టి నమ్మకంతో, తన సహోద్యోగులు, ఆఫీసర్స్ నమ్మకపోయినా ఆధారాల కోసం వెతుకుతూ వెళుతుంది. ఈ ప్రయత్నములో ఎలా విజయం సాధించింది, కిల్లర్ ఈ హత్యలు చేయటానికి కారణం ఏమిటి అనేది చిత్రంలో చూపించారు. రెండవ భాగం నుండి కధ సస్పెన్స్ గా, పోలీస్ విచారణల ఐడియాలజీ, విధానాలను చూపించి కొంచం ఆసక్తి రేపెలా ప్రయత్నం చేసారు. ఒకానొక సమయంలో కెరీర్ లో పైకి ఎదగాలి అని, లేదా ఎదగాలికి అనుకుంటున్నా యువతులు మహిళలే హంతకుడి లక్ష్యంగా, చేసిన హత్యల్ని ఆత్మహత్యలు లేదా ప్రమాదాలుగా సృష్టిస్తున్నట్టు, కిరణ్ (పాయల్) కి దొరికిన అన్ని కేసులలో హంతకుడి మోటివ్ ఓ లాలిపాప్ అని నిర్ణయానికి వస్తుంది. కధ కొంత అల్లినట్టు చక్కగా తెలిసిపోతుంది. కొన్నిచోట్ల డబ్బింగ్ సమస్యలున్నాయని తెలుస్తుంది. పాత దూరదర్శన్ సీరియల్ నటులు వినోద్ బాల, రూప వంటి వారిని చూడచ్చు. 
నటనా వర్గం : Sivannarayana, Payal Rajput, Rajeev Kanakala (అతిధి పాత్రలో ), Vinod Bala
దర్శకత్వం : Prandeep Thakore
నేపధ్య సంగీతం : Mahati Swara Sagar
రచన : Thayanidhy, Sivakumar
ఒక్కమాటలో :  చిన్నతనంలో స్త్రీ పై ద్వేషం పెంచుకున్న ఓ మానసిక రోగి చేసిన హత్యలకు ముగింపు పలికిన ఓ రక్షకభటురాలి కధ  
-- అవ్యజ్ (శంకర్)2**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog