Yevam

 ఏవం - కథానాయకుడే ప్రతినాయకుడు అయితే


చాందిని చౌదరి క్యూట్ పోలీస్ ఆఫీసర్ గ వచ్చిన ఈ చిత్రం జులై 25 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కధ విషయానికి వస్తే ఆడపిల్ల ఆడపిల్ల అంటూ అందరు అనే మాటల్ని వింటూ పెరిగిన సౌమ్య ఆ మాటల్ని అబద్దం చేయటానికి తనను నిరూపించుకోవాలని పోలీస్ అవుతుంది. తాను పనిచేసే చోట కూడా అదే అనుభవం అపుడప్పుడు అదే ఎదురవుతూ ఉంటుంది. కానీ కొత్త కాన్సెప్ట్ ఇలా కూడా వాడుకోవచ్చు అనిపించింది. స్ప్లిట్ పర్సనాలిటీ అనేది కధ సారాంశం. తన సహ ఆఫీసర్ అభిరాం క్రమశిక్షణతో  ప్రేరణ పొంది ఉద్యోగం లో చేరిన సౌమ్య తరువాత అభి ప్రేమలో పడుతుంది. అప్పటికే అభికి పెళ్లి అయిందని, తన భార్య దూరమయింది అనే విషయం తెలుసుకుని ఆమె గురించి ఆరాతీయడం మొదలు పెడుతుంది. ఆ విచారణలో తనకు దొరికిన ఆధారాలు అభిని అనుమానాస్పదంగ చూపటం ప్రేక్షకులకు ఆశ్చర్యమైన ఫీల్ ఉంటుంది. ఆ విచారణను నిరూపించడంలో ఆసక్తి కనపడుతుంది. అభికి ఉన్న రుగ్మత ఏంటో తెలిసుకొని , ఎలా బయటపడతాడు అనేది ఆశక్తిగా చూపకపోవటం లో విఫలమయ్యాడు దర్శకుడు. కాకపోతే ఓ 15 నిముషాలు మాత్రం అనుమానం రేకెత్తించటంలో విజయం సాధించాడు. అక్కడక్కడా వున్న చిన్న హాస్యం మాత్రమే. కలర్ ఫోటో తరువాత బక్క చిక్కిన చాందిని చౌదరి అడపాదడపా 'గామి' వంటి సినిమాలలో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తూ సరైన హిట్ కోసం కష్టపడుతుంది. నటన మరీ తీసేశాలా ఏమి లేదు. ఇంకొంచం దర్శకత్వం, కథనం విభాగాలలో కృషి చేయవలసింది. 
నటవర్గం :  చాందిని చౌదరి (సౌమ్య) , వశిష్ట సింహ (అభి), జై భారత్ రాజ్, ఆషురెడ్డి (హారిక) 

దర్సకత్వం : ప్రకాష్ దంతులూరి 

నిర్మాతలు :  నవదీప్,పవన్ గోపరాజు 

సంగీతం : కీర్తన శేష్, నీలేష్ మండాలపు 

సినిమాటోగ్రఫీ : ఎస్. వి. విశ్వేశ్వర్ 

ఎడిటింగ్ : సృజన అడుసుమిల్లి 

ట్రైలర్  : Trailer

-- అవ్యజ్ (శంకర్)2**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog