Darling & Love Mouli

డార్లింగ్ - మ్యాడ్, మాక్స్, మ్యారేజ్ ఎంటర్టైనర్

డార్లింగ్ 

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్ చిత్రం జులై లో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓ.టి.టి. ప్లాట్ఫారం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కధ విషయానికి వస్తే ప్రియదర్శి రాఘవ్ గా ఆనందిగా  నట నభాష ఇద్దరు ఆత్మహత్య చేసుకొనే సన్నివేశంతో చిత్రం మొదలు అవుతుంది. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి పెళ్ళిచేసుకుని హనీమూన్ కి పారిస్ వెళ్ళాలి అనే చిన్ననాటి చందమామ కధలో మాయ చేసినట్టు చదువుకోడానికి అమ్మ చెప్పిన మాటని పట్టుకుని అదే కలగా పెరిగి పెద్దయితాడు. ఎన్నటికీ ఆ కల నెరవేరక వైరాగ్యంతో చనిపోవాలనుకున్నటు చూపించారు. అక్కడి నుండి కదా మద్దలవుతుంది కాస్త గతం నుండి వర్తమానంలోకి తీసుకెళ్లి ఆనందిని పెళ్లి చేసుకోవటం తరువాత ఆనంది కి ఉన్న వివిధ రకాల వైవిధ్య ప్రవర్తన సమస్య (స్ప్లిట్ పర్సనాలిటీ ) బయటికి వస్తుంది. ఒకే వ్యక్తిలో ఇన్ని రకాల అసహజ ప్రవర్తనలు ఉండటం అనేది అరుదైనదని మానసిక వైద్యురాలు నందిని చెప్పిన మాటలను తీసుకొని అక్కడి నుండి ఆ సమస్యను తన చిన్ననాటి స్నేహితురాలు, తనని పెళ్లి చేసుకోవాలనుకుని తప్పిపోయిన నందిని (అనన్య నాగళ్ళ) తో కలిసి ఎలా ఎదుర్కొన్నాడు అనేదే చిత్రంగా సాగే పయనం. తన భార్యకి వున్న సమస్యను మరిపించటంలో హాస్యంతో కలిపి రాఘవ్ గా ప్రియదర్శి అక్కడక్కడా భావోద్వేగాలను చక్కగా పండించాడు. కొంచం ప్రేమ, కొంచం కోపం, అసహనంతో భార్య పెట్టిన కష్టాలు, కాస్త తికమకలతో కలిసిన చిత్రంగా సాగింది. కొణిదెల నిహారిక అతిధి పాత్రలో వచ్చి కధకి మలుపుతో కూడిన మలుపు ఇచ్చింది. తన భార్యగా అనుకుని మానసికంగా తన పరిస్థితిని ఓర్చుకుని ఓ ఓదార్పు, ఓ బుజ్జగింపు, న్యూనతలో ఉన్న మనసుకు ప్రేరణ ఇచ్చే మార్గదర్శకుడిగా చేసిన నటన గుర్తించదగినది.  చివరిగా ఆ వ్యక్తితో జీవితంలో పూర్తిగా అన్యోన్యంగా కలిసారా లేదా అనేది  ముగింపు. 

నటవర్గం: Priyadarshi Pulikonda, Nabha Natesh, Ananya Nagalla, Brahmanandam, Kanneganti, Muralidhar Goud, Raghubabu , Vishnu OI , Jeevan Kumar
దర్శకత్వం: Aswin Ram 
సంగీతం: 
Vivek Sagar
పాటలు: Kasarla Shyam
-- అవ్యజ్ (శంకర్) 2.9**/5*****

లవ్ మౌళి 


ఇందులో నవదీప్ హీరోగా A-సర్టిఫికెట్ వచ్చిన ' లవ్ మౌళి ' చిత్రం ప్రస్తావన కూడా రావటానికి ప్రధానాంశం అందులో కూడా వైవిధ్యమైన ప్రవర్తనలు అనే సారాంశం ఉండటం. చిత్రకారుడు మౌళిగ నవదీప్ యానిమల్ చిత్ర తరహా సన్నివేశం వేషం, భాషతో ప్రేక్షకులకు కనిపించాడు. ఇందులో చిన్న తనంలోనే అందరిని పోగొట్టుకుని ఒంటరిగా తన చిత్రకళ లోనే అన్ని భావాలను పలికిస్తూ, జ్ఞాపకాలను చూసుకుంటూ ప్రపంచానికి దూరంగా పేరుపొందిన చిత్రకారుడిగా కనిపించి, స్త్రీ ద్వేషిగా చిత్రింపబడ్డాడు. ఓ ప్రేమ వ్యవహారంలో విఫలమైన తనకు ఎలాంటి అమ్మాయి రావాలి అనే భావలనను తన వూహ చిత్రంలో నింపుకుని వారితో గడిపే నిజజీవితం ఎలా ఉంటుంది అనే అంశాలు తెరకెక్కించారు. సహజంగా అందరిలో ఉండే 'నేను-నాకు నచ్చేలా నా సన్నిహితులు '  అనే భావనకి పెద్దపీట వేసి పాత్రలను సృష్టించి నడిపించిన చిత్రం. మన జీవితంలోకి వచ్చిన లేదా రావాలనుకున్న మనిషి అన్ని వేళల్లో మనం అనుకున్నట్లు మనకు నచ్చినట్లు నడుచుకొంటే ఆ జీవితం, ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో చూయించారు. ఆ అహంకార భావన నుండి మౌళి బయటకి వచ్చాడా సాధారణ జీవితం గడిపాడా అనేది చిత్ర ముగింపు. 
నటవర్గంNavdeep, Pankhuri Gidwani, Charvi Dutta
దర్శకత్వం : Avaneendra
ఓ.టి.టి. : Aha 
-- అవ్యజ్ (శంకర్) 2.5**/5*****


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog