Modern Masters - Rajamouli

 మోడరన్ మాస్టర్స్-ఎస్.ఎస్.రాజమౌళి 


చూసారా లేక మీరూ మిస్ అయ్యారా..? మోడరన్ మాస్టర్స్ - ఎ డాక్యుమెంటరీ అఫ్ ఎస్. ఎస్. రాజమౌళి . ఆగష్టు 2 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అవునండి నిజంగా ఈ డాక్యుమెంటరీ చూపించిన తెరవెనుక సిత్రాలు, భావోద్వేగాలు, నిజమైన కష్టాలు. ఇంగ్లీష్ లో రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత విశ్వ వ్యాప్తంగా మన తెలుగువాడు అయిన రాజమౌళి పేరుని తెలిసేలా చేసిన చిత్రాలు రావడంతో ఆయన చిత్ర దర్శకత్వ ప్రయాణం, అందులో తీసుకొనే మెళకువలు, సమిష్టి కృషి విధి విధానాలు, కుటుంబ నేపధ్యం, నిత్య దినచర్య వంటి వాటిని అక్కడక్కడా జోడించి క్లుప్తంగా బాహుబలి వంటి చిత్ర నిర్మాణంలో అద్భుతాలను ఉదహరిస్తూ తీసినది. చూడటానికి సినిమా పరిశ్రమ పరిచయం పెద్దగా లేని వాళ్ళకి రాజమౌళి అభిమానులకి వారాంతంలో సేదతీర్చే టానిక్ తీశారు రాఘవ కృష్ణ. బాహుబలి రెండు భాగాలూ తదుపరి వచ్చిన ఆర్.ఆర్.ఆర్. చిత్రం వరకు రాజమౌళి చేసిన ప్రయాణం ఒడి దుడుకులు కలగలిపిన ఒక గంట వ్యవధి కలిగిన వీడియో.  అసలు రాజమౌళి ఎందుకు రౌద్ర రసాన్ని ప్రధానం గా ఎంచుకున్నాడు అని, నాస్తికుడని తెలిపే రహస్యాలు కూడా చూపించారు. రాజమౌళి తో ప్రయాణం చేసిన కధా నాయకులూ, సంగీత దర్శకులు, పోరాట దర్శకుడు రచయితల అభిప్రాయాలూ ఆస్కార్ వరకు చేసిన ప్రయాణం మొత్తంగా అన్ని కలగలిపి నడిపించిన వీడియొ. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog