D.I.N.K.

D.I.N.K. (Cast your vote)

DINK Short film
DINK - Short film by TAMADA Media

చిన్న చిత్రం  పేరు ఆసక్తిగా ఉంది కదా... ?? మరే ! ఉద్దేశం కూడా ఆసక్తి గ ఉన్నట్టుంది అనుకొనే చిత్రాన్ని  చూడచ్చు. తెలియకపోతే ఏదో కొంత తెలుసుకోవచ్చు. ఇంతకీ ఏమి తెల్సుకోవాలో అనుకొంటే అది అప్పుడే చెప్పేస్తే ఎలా.? పాత చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు (బి. ఏ) నిర్మాణంలో తమడ మీడియా నుండి విడుదలయిన లఘుచిత్రం.

ప్రస్తుత యువతరం ఆలోచనల్లో వస్తున్న అనూహ్య మార్పులు, కేవలం సంపాదనే ధ్యేయంగా, జీవితం అంటే వేరే ఏమి అవసరం లేదు అనే మిడిమిడి జ్ఞానం, పెళ్లి అనే బంధం పైన యువతలో  తగ్గుతున్న  మోజు, ఆకాశమంటే కోరికలు, పూర్తిగా స్థిరపడాలి అనే ఆలోచనలతో వయసు మీరిపోతున్నా కూడా ఓ తోడు దొరకని స్త్రీ-పురుషుల మానసిక, సామాజిక సందర్భాలు దృష్టిలో నుండి  మానవ మనుగడకు మూలమైన సంతానోత్పత్తి పైన ద్వంద్వ అభిప్రాయాలూ అనే సందిగ్ధ అంశాల పైన  పుట్టిన కథ. ఇక ఈ లఘుచిత్రం మంచి కోసమా,  చెడు కోసమా అనేది చూసే వారి దృష్టి కోణం నుండి మాత్రమే, పూర్తిగా వారి వారి జీవన పరిస్థితులను బట్టి, అనుభవాలను బట్టి ఏకీభవించటమా, వ్యతిరేకించటమా అనేది ఆధారపడి ఉంది. కాకపోతే ప్రతి వ్యక్తి ఈ సమస్య మూలాల్ని గురించి అన్వేషించాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఆ ఆలోచనల్లో బ్రతికేవారు మీ పిల్లలు అయ్యుండచ్చు, ఇప్పుడే బ్రతుకుతుంటే రేపు భవిష్యత్తు వారికి వేసే ప్రశ్నలకి ఏ సమాధానమో తెలుసుకోవాలి కదా. 

దీనిని కధ అనే కంటే నేటి యువ సమాజ మదిలో వస్తున్న ప్రశ్న అనడం సబబేమో. " DUAL INCOME NO KIDS ". ఇద్దరం కష్టపడి చేతినిండా సంపాదించాలి, ఒకరికొకరం అంటూ బ్రతకాలి, మన సంతోషాలకి అడ్డంగా పిల్లలు అనకుండా, వారి భవిష్యత్తుకు ఏదో ఆలోచించి మంచి చేసాం అనే అభిప్రాయాన్ని చెప్పుకుని బలంగా సమర్ధించుకోవటం. బాధ్యతల్ని ఓ సవాలుగా తీసుకొని బ్రతక లేకపోవడం. నేటి కాలపు సమాజ పోకడల, పరిస్థితుల దృష్ట్యా పుట్టబోయే పిల్లలకి సరైన భవిష్యత్తు, పూర్తి సమయం, సరైన విలువలు కలిగిన విద్య, ఆరోగ్యం, జీవితానికి భరోసా ఇవ్వలేమేమో అనే ప్రశ్నలకు సమాధానం లేకపోవడం కలిసి ఓ జంటని సందిగ్ధంలోకి నెట్టివేయబడుతుంది. 

అమ్మ అనే పిలుపులోని మాధుర్యం తెలియలేని ఆడతనం, నాన్న అనే పదవి ఇష్టమైనా, ఆ బాధ్యతకి న్యాయం చేయటానికి ధైర్యం పూర్తిగా సరిపోని ఓ మగతనం కలిసి చేసిన ప్రయాణమే ఈ లఘు చిత్రం. నటన, శృంగారం, ఆనందం, హాస్యం ఇలా మిగిలినవి ఏవి పెద్దగా ప్రాధాన్యత అవసరం లేని ఈ లఘుచిత్రంలో దంపతులలో ఉదయించే భయంకరమైన ప్రశ్ననే అందరిని ఆలోచింప చేసేది. ఓ మార్పుకి కూడా నాంది పలకాల్సిన బాధ్యత ఓ మంచి ప్రేక్షకుడిది. ఎప్పుడో వీగిపోయిన, ఇంకా వీగిపోతున్న మానవ విలువలని ఒడిసి పట్టి నేటి తరానికి అందించటమే కాకుండా, ఆ విలువలను కాపాడుకొనే భవిష్యత్తు సమాజాన్ని పరిస్థితులను ఇప్పటి నుండే నిర్మించటంలో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రతీ ప్రేక్షుకుడి పైన ఉంది అనేది నిజం. చిత్రంలో అయితే కధ ఎక్కడోచోట మంచి ముగింపు కావలి కనుక ప్రశ్న - సమాధానం రెండు దర్శకుడే చెప్పాడు. కానీ అవి తెలియని, ఇంతకు ముందు లేని కొత్త విషయాలేమి కాదు.  అర్ధం చేసుకోలేక పోవడమే నేటి తరం లోపం ఐతే అర్ధం అయ్యేలా చెప్పలేకపోవడం ముందు తరాల లోపం. 

నటులు : పవన్ సింగళూరి, రిషిత రెడ్డి 
దర్శకత్వం : సాయి తేజ గోన 
రచన : ఓరుగంటి రవితేజ
 
-- అవ్యజ్ (శంకర్) 2.5 **/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog