Vaazhai - Tamil dub

 వాళయి(అరటిపండు)Vaazhai Telugu Review

పరిచయం : 

తమిళ వాళయ్ తెలుగులో (అరటిపండు) అనువాద చిత్రం. ఇది 2024లో విడుదలైన భారతీయ తమిళ భాషా బాలల నాటక చిత్రం. దర్శక నిర్మాత మేరీ సెల్వరాజ్ తన చిన్నతనంలో చూసిన ప్రత్యక్ష సన్నివేశాలను అద్భుతంగ ప్రేక్షకులకు అందించారు. ఈ నెల 10 వ తేదీ నుండి , తెలుగుతో సహా 6 భాషలలో Disney+  hotstar  లో నిరాటంకంగా ప్రదర్శింపబడుతోంది.  నవంబర్ 2022లో ఈ చిత్రం నవవీ స్టూడియోస్ మొదటి ప్రొడక్షన్ అయినందున ప్రొడక్షన్ నెం.1 అనే తాత్కాలిక టైటిల్‌తో అధికారికంగా ప్రకటించబడింది, తరువాత కొన్ని రోజులకు అధికారికంగా వాళయి టైటిల్‌ను ప్రకటించారు. ప్రధాన ఫోటోగ్రఫీ అదే నెలలో ప్రారంభమైంది. ఇది చాలా భాగం తూత్తుకుడి మరియు తిరునెల్వేలిలో చిత్రీకరించబడింది మరియు జనవరి 2023 మధ్యలో ముగిసింది. 2024 ఆగస్టు నెలలో వెండితెర పైన విడుదల అయిన ఈ చిత్రం మంచి ప్రచారమే పొందినది. అనువాద చిత్రం అయినప్పటికీ ఒకసారి చూద్దాం అనుకుని చిత్రం చూడటం మొదలుపెట్టాను. చివరికి చెమర్చిన కనులతో ముగింపు పలికింది. 

కధ - కధనం
దర్శకుడు శంకర్ సహా వివిధ ప్రముఖ వార్తా పత్రికలూ, అంతర్జాల వేదికలు ఈ చిత్రానికి మంచి సమీక్షలు ప్రచురించి తమ ఆదరణని తెలిపాయి. మేరీ సెల్వరాజ్  దర్శకత్వంలో స్వయంగా నిర్మించిన ఈ చిత్రం తన చిన్ననాటి సంఘటనలను ప్రేరణగా తీసుకొని కొంచం వూహా జనికమైన కధను జోడించి తీయబడినది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో చాలామంది పేద రైతులు అరటి తోటలోని పండ్ల గెలలను కోసుకొంటూ అక్కడి మధ్యవర్తుల కింద కూలి పనిచేస్తూ జీవనం గడుపుతుంటారు. అందులోని ఓ తెలివైన విద్యార్థి (శివనైందన్) జీవిత కధనే ఇందులో చూపించారు. అక్కడి పిల్లలు దగ్గరలోని పాఠశాలలోని చదువుకొనటానికి ప్రతిరోజూ ౩ కిలోమీటర్లు నడిచి వెళ్ళిరావడం తప్పని దినచర్య. మిగిలిన సెలవు దినాలలో కుటుంబం మొత్తము గెలల పనికి చాలీ చాలని రోజువారి కూలికి వెళ్ళి సంపాదించడం తప్పనిసరి. అలా వెళ్లడం ఈ చిత్రంలోని శివానైందన్ కి చిన్నతనం దృష్ట్యా నచ్చేది కాదు. అలా సాగుతున్న ఈ కుర్రాడి జీవితంలో మంచి ప్రేరణగా ఉండే ఉపాధ్యాయని కథానాయకి పూంగోడి (నిఖిల విమల్ ) పరిచయం ఓ జ్ఞాపకంగా మారుతుంది. శివనైందన్, తన తోటి స్నేహితుడు, అదే ఊరివాడు ఐన శేఖర్, పూంగోడి మధ్య జరిగే సన్నివేశాలు సున్నితంగా మరియు మనోహరంగా ఉన్నాయి. ఆమెలో, శివానైందన్ తనని తానుగా అంగీకరించే వ్యక్తిని, ఎప్పుడు శిక్షించని తల్లిని చూస్తాడు. పూంగోడి జీవన శైలి, శివనైందన్ యొక్క వాస్తవిక జీవితానికి దూరంగా ఉన్న పెద్ద సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. అలా వారాంతపు సెలవులలో తమ అక్కయ్య, స్నేహితుడు శేఖర్ లతో కలిసి రోజుకూలికి వెళ్లే ఈ శివనైందన్ ఓ రోజు ఆ పనిని మానుకొని తప్పించుకొని పాఠశాలకు వెళ్ళటం, అదే రోజు తన జీవితంలో జరిగిన మలుపులు ఈ చిత్రానికి ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. కర్మ ఫలం, చిన్నతనంలోని అమాయక బాలల ఆకలి బాధ ఎలా ఉంటుంది అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు దర్శకుడు. 
Vaazhai Telugu

ఆస్తులు: ఇందులో శివానైందన్ నటన చిత్రానికి పెద్ద ఆస్తి, మిగిలిన పాత్రధారులు కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. రెండవభాగం నుండి చివరి 30 నిముషాలు మనసుని, కంటిని  చెమర్చేలా చేస్తాయి. సున్నిత హృదయాలను, పల్లెటూరి వాతావరణం తెలిసినవారికి చిన్నతనంలో ఆ పచ్చని పైరు వాసనలు గుర్తుచేస్తూ బలంగా తాకుతాయి. నేపధ్య సంగీతం ఫరవాలేదు. నిఖిల విమల్ ఆహార్యం. 

కుదుపులు :  తమిళ నేటివిటీ తెలుగు ప్రాంత వాసులకు కొంత రుచించకపోవచ్చు. మొదటి భాగంలో కొంత మేర బావున్నా మిగిలిన భాగం సాదాగా సాగుతూ ప్రేక్షకుడు చిత్రంలోని పాత్రలకు అలవాటు పడి కధలో లీనమవ్వటానికి కొంత సమయం పడుతుంది.  తెలుగు పదాలు, పాటలు కొంత నప్పలేదు.

  • బ్యానర్ : నావి స్టూడియోస్, ఫార్మర్స్ మాస్టర్ ప్లాన్ ప్రొడక్షన్ 
  • నటవర్గం : పోంవెల్, నిఖిల విమల్,  సతీష్ కుమార్, దివ్య దురైసామి , రఘుల్, ఆర్. కలాయ రసన్, జానకి
  • దర్శకత్వం , రచన : మేరీ సెల్వరాజ్ 
  •  నిర్మాతలు : దివ్య మేరీ సెల్వరాజ్ , మేరీ సెల్వరాజ్ 
  • సంగీతం : సంతోష్ నారాయణ్ 
  • -- అవ్యజ్ (శంకర్) 3**/5*****


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog