అనగనగా. . .
"అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే " అని ఓ పాట రాసిన కవిని గుర్తుచేసుకుంటే ఈ చిత్రం మొత్తం ఆ పదాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సుమంత్ అక్కినేని చాలా విరామం తరువాత ఫెమినా మిస్ యూనివర్స్ ఇండియా 2024 (బీహార్) విజేత కాజల్ చౌదరీ జంటలో వచ్చిన చిత్రమే ఈ "అనగనగా"
ఏ థియేటర్ లో విడుదల కాకుండా ఈ నెల అంటే మే 15 నేరుగా ప్రముఖ ఓ.టి.టి. వేదిక ఈ.టి.వి. విన్ లో ప్రదర్శిస్తున్న చిత్రమే ఈ "అనగనగా" కాజల్ చౌదరి నూతన పరిచయంగ తెలుగులో నటించిన మొదటి చిత్రం.
కధా కమామీషు
సుమంత్ అక్కినేని చాలా విరామం తరువాత తీసిన చిత్రం కావడం ప్రచార మాధ్యమాలతో చేసిన ప్రచారం ద్వారా నాగ చెతన్య, దుల్గర్ సల్మాన్ విడుదల చేసిన టీజర్ ఆసక్తి పెంచి అందరికి చేరువైన చిత్రంగా ఈటీవీ విన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పేరున్న పాఠశాలలో వ్యాస్ సర్ గా సుమంత్ , అదే పాఠశాలలో ప్రిన్సిపాల్ భాగీగా కాజల్ చౌదరి నటిస్తూ చిత్రాన్ని నడిపించారు. ముఖ్యంగా ఈ చిత్ర కథ ఈ ఆధునిక యుగంలో వ్యాపారం చేస్తున్న విధ్యా విధానాలకు, వాటి ద్వారా ఛిద్రమౌతున్న చిన్నారుల లేత పచ్చిక వంటి బాల్యం దాని పరిణామాలు కలిపి వాటిపై ఉపాధ్యాయుడుగా వ్యాస్ చేసిన సృజనాత్మక త్యాగానికి అద్దమే ఈ చిత్రం.
విశ్లేషణ
అవసరాల శ్రీనివాస్ చైర్మన్ గ ఉన్న కార్పొరేట్ పాఠశాలలో వ్యాస్ - భాగీ ఇద్దరు భార్యాభర్తలు అదే పాఠశాలలో పనిచేస్తున్నప్పటికీ వారి బోధనా ప్రపంచం పూర్తి భిన్నంగా ఉంటుంది. పిల్లల చదువు రాంక్ లు అంటూ పోటీ ప్రపంచానికి సరిపోయేలా ధీటుగా సరిదిద్దాలి అని ప్రిన్సిపాల్ భాగీ ఆలోచిస్తుంటే ఆ విధానంపై విమర్శలు, దానిని సరిగా అందుకోలేని అర్ధం చేసుకోలేని చిన్నారుల తరపున వ్యాస్ వాదన ఉంటుంది.
దానికి తగిన మార్పులు చేసుకోవటం వాటిని అర్ధమయ్యేలా బోధించటం వంటి బోధనా పద్ధతుల పైన చేసిన కసరత్తు ఈ చిత్రం. సాధారణ ఐ.ఐ.టి. , ఇంజనీర్ వంటి ఆధునిక బ్లాక్-బోర్డు బట్టి కొట్టే విధానం, ఈ పుస్తకాల బోధనకు భిన్నంగా కధలు బొమ్మలతో సృజనాత్మకంగా బోధించటం వలన వచ్చే ఫలితాలు వెనకబడిన పిల్లలకి చదువు పైన పాఠ్యాంశాల పై ఉన్న భయం పోగొట్టి సులభంగా అర్ధం చేసుకుని పరీక్షలలో మంచి ఫలితాలు పొందేలా చేయటానికి కృషి చేయటంలో విజయం సాధిస్తాడు.
వ్యాస్ జీవితంలో వచ్చిన హఠాత్ పరిణామం వలన మార్పులు ఏంటి, ఎలా తన కల ప్రజలకు చేరువయ్యేలా నెరవేర్చుకున్నారు అనేది ఈ చిత్ర సారాంశం. ఈ చిత్రంలో వ్యాస్ సృజనాత్మకకి మూలం తన కొడుకు రామ్ మరియు సహ విద్యార్థులు. ఓ అనాధ అయిన వ్యాస్ కి తన చిన్నతనం లో విన్న కధలు దాని ద్వారా చదువులో పొందిన విజయాలు సాధించిన అనుభవం కూడా తోడై కధకి సహాయం చేస్తాయి.
ఆస్తులు
సుమంత్ నటన, భాగీ అందం, ఏ అసభ్యత లేని కధనం, కొడుకు రామ్ (మాస్టర్ విహార్ష్ ) నటన కూడా ఓ ఆస్తి , ముఖ్యంగా ఈ సమ్మర్ సెలవుల్లో రాబోయే పాఠశాల విద్య బోధనలో మార్పుని కోరి చిత్రాన్ని విడుదల చేసిన సమయం, నేపథ్య సంగీతం
కుదుపులు
సాదాగా నిదానంగా సాగె కధనం , ఆకట్టుకో(లే)ని పాటలు, హాస్యం, కొత్తదనం లేని పాత చిత్రాల కోవకే చెందిన కథ, మెరుగులు దిద్దటానికి ఆస్కారం వున్న చాలా సన్నివేశాలు
నటీనటులు : సుమంత్ అక్కినేని, కాజల్ చౌదరి, అను హాసన్, మాస్టర్ విహర్ష, రవి రాచకొండ, అవసరాల శ్రీనివాస్, కౌముది నేమాని
దర్శకులు : సన్నీ సంజయ్
సంగీతం : చందు రవి
నిర్మాత : రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి ,
ఎడిటర్ : వెంకటేశ్ చుండూరు
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.