Office-2025 Series

ఆఫీస్ - 2025 

100 ఎపిసోడ్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న  హార్ట్ బీట్ - దర్శకుడు అబ్దుల్ కబీజ్ కెమెరా కలం నుండి వచ్చిన సిరీస్ నే ఈ ఆఫీస్ సిరీస్. ఫిబ్రవరి 21 నుండి తమిళ మాతృకలో విడుదల అయిన ఈ సిరీస్ ఈ నెల 9 నుండి జియో హాట్ స్టార్ ఓ.టి.టి.లో తెలుగులో అందుబాటులోకి వచ్చిన సిరీస్. ప్రస్తుతం 52-ఎపిసోడ్స్ తో జరుగుతూ వారాంతంలో ఎపిసోడ్స్  కలుపుకుంటూ సాగే ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 

కథా కమామీషు 

ఓ మారుమూల గ్రామం , అందులోని తాశీల్దార్ ఆఫీస్ లో ఫైల్స్ ని డిజిటలైజ్ చేయటానికి వచ్చిన నలుగురు  ఐ.టి.టీం పారి, మూర్తి, షమీ, ప్రవీణ్ పనిచేస్తుంటారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కలగా ఉన్న వీరందరికి మొదటి కాంట్రాక్టుగ ఈ ప్రభుత్వ ఆఫీస్ ప్రాజెక్ట్ పైన రావడం అక్కడి జరిగిన పరిణామాలు అందులో నుండి ఆ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఐ.టి సమూహ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు అనేది పూర్తి సిరీస్. ప్రేమ , అక్కడక్కడా హాస్యం, యువ జంటల అల్లరితనం కలిపి, కధా నాయకుడి నిజాయితీ ఆత్మ విశ్వాసంతో అపుడప్పుడు వచ్చే సమస్యలు వాటిని ఎదుర్కొన్న పరిస్థితులు కలిపి ఆడిన ఆటనే ఈ సిరీస్ కథ.

విశ్లేషణ   

వర్క్ చేసే ప్రాంతంలో జరుగుతున్న విషయాలతో పాటు ప్రేమ, హాస్యం, విలనిజం వంటి వాటిని కలిపి చెప్పటంలో దర్శకుడు కబీజ్ హర్ బీట్ సిరీస్ తో మంచి అనుభవం తెచ్చుకున్నారు, అదే పనితీరు ఈ సిరీస్ లో కూడా కనిపించింది. అల్లరి చిల్లరిగ తిరిగే యువత లేత యవ్వనంలో ఉండే ప్రేమ సన్నివేశాలు సంభాషణలు అందంగా వచ్చాయి.కాకపోతే మొదటి 10-12 ఎపిసోడ్స్ కొంచం సాగతీతగా ఉన్నట్టు అనిపిస్తాయి, తరువాతి నుండి కథలోకి తీసుకువెళ్లిన దర్శకుడు ప్రయత్నంతో కధ కాస్త ఆసక్తిగా మొదలవుతుంది. 

తాసీల్దార్ ఆఫీసులో జరుగుతున్న లొసుగులు వాటిని బయటకి తీసే ప్రయత్నంలో చేసిన పోరాటం వాటిని పరిష్కరించిన తీరు చెప్పేదే ఈ సిరీస్. తెలిసిన కధనే అయినా సిరీస్ లో లీనమయిన తరువాత సరదాగా అనిపించింది. రాఘవగా తాహసీల్దార్ తన పాత్రకి అమాయకత్వం కలిపి ఓ ప్రేమికుడుగా పాత ఆచారాలు పాటించే భక్తుడిగా జానకి ప్రేమలో లీనమయి నటించిన తీరు బావుంది. 

Smeha Official

అసలైన ఆడపిల్ల చిర్రు బుర్రులు చూపించే పాత్రలో స్మేహ మణిమేఘాలై చక్కగా కనిపించింది. నిరక్షరాస్యులు అయిన గ్రామస్తుల గొడవలు, అన్ని పనులకి తాసీల్దారు ఒక్కరే సమాధానం ఇస్తారు అనే అమాయకం అపుడప్పుడు నవ్విస్తుంది. తాహశీల్దారు ఆఫీసులో అవినీతిని అరికట్టే సమయం కోసం పారి చేసే ప్రయత్నంలో జరిగే సన్నివేశాలు బాగా వచ్చాయి. ఒకే గ్రామంలో ఒకే ఆఫీసులో తీసిన పూర్తి గ్రామీణ సిరీస్. 

ఆఫీసులో స్వయంగా ఉండి సిరీస్ ని చూస్తన్నట్టు ప్రేక్షకుడికి అనిపించేలా ఉంది. ఉన్న అందరు నటులు సహజంగానే నటించారు. తమిళ్ నేటివిటీ పూర్తిగా కనిపించింది. విఫలమైన ప్రేమలు, విజయమైన ప్రేమలు నటిస్తూ ఆటపట్టించే ప్రేమలు ఆహ్లాదంగా ఉన్నాయి. ఓపికగా చూడవలసిన పూర్తి వారం గడిచే సిరీస్ వంటి సీరియల్. 

Smeha Meghamala

ఆస్తులు   

స్నేహ మణిమాల అందం, ఆట పట్టించే అల్లరితనం, ముత్తు చేసే తిండి గోలతో పాటు అప్పుడప్పుడు పారికి దగ్గరవ్వాలని స్నేహని ఆటపట్టించే సన్నివేశాలు, దర్శకత్వం, ఉన్న అందరి పాత్రలకు న్యాయం చేసేలా ఉన్న కధనం 

కుదుపులు   

సాగతీసేలా అనిపించిన కొన్ని ఎపిసోడ్స్,  మధ్య మధ్యలో వచ్చే అవసరం లేదేమో అనిపించిన ఒకట్రెండు  పాత్రలు. 

నటీనటులు :  గురు లక్ష్మణ్, స్నేహ మనిమాలాగై, కీర్తి వేల్, వైశాలి కేమకర్ ఇంకా తదితరులు 
దర్శకులు :  అబ్దుల్ కబీజ్   
సంగీతం :  
 శరన్ రాఘవన్  
నిర్మాత :  జగన్ భాస్కరన్ ,  విమల్ కుమార్    

ఎడిటర్ : విజయ్ కృష్ణన్     

-- అవ్యజ్ (శంకర్) 3***/5*****

ప్రతి శుక్రవారం కొత్త భాగాలు విడుదలవుతూ 61-నుండి 68-భాగాలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog