Constable-Kanakam (Etv-Win)

కాన్స్టేబుల్ - కనకం

స్త్రీ పాత్రలకి అధిక ప్రాధాన్యత కల చిత్రాలు ఈ మధ్యకాలంలో తరచుగా వస్తూ ఉన్నాయి. అలాంటి కోవకి చెందినదే ఈ కాన్స్టేబుల్ - కనకం ఓ.టి.టి. అంతర్జాల చిత్రశ్రేణి (వెబ్ సిరీస్) కూడా. విడుదలకు ముందే వివాదం తెరపైకి తెచ్చిన శ్రేణి. జీ5 ఓ.టి.టి. తెలుగులో ప్రసారమవుతున్న పి.సి. మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్ ఈ శ్రేణి కధని అనుసరించి నిర్మించారని వివాదం. ఈ సిరీస్ కూడా చూసాక రమారమి ఓకే కథ పాత్రలు - పేర్లు , మార్చి తీశారెమో అనేలా ఉండడం ప్రేక్షకుడికి కొంత నిరాశే అని చెప్పవచ్చు. 

Constable kanakam OTT Review Telugu

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ సహ నటులుగా నిర్మించిన ఈ చిత్రం 14 నుండి ఈటీవీ విన్ ఓ.టి.టి. లో ప్రదర్శనకు వచ్చింది. ఇది కథలో సస్పెన్స్ కలిగిన చిత్రాల వర్గంలోకి వచ్చిన శ్రేణి. 

కథాకమామీషు : 

ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామం రేపల్లె. ఇది 1990 లో జరిగిన కధా వృత్తాంతం. అడవి గుట్ట అనే అటవీ ప్రాంతంనకు ఆనుకుని ఉండే గ్రామం రేపల్లె. తరచుగా అందులోకి వెళ్లిన, ఆ దారి వైపుగా వస్తున్న అమ్మాయిలు ఎవరైనా మాయమవుతూ ఉంటారు.  ఈ సంఘటనకి భయపడి ఆ గ్రామంలోని ప్రజలు ఎవరైనా రాత్రి సమయాల్లో తిరగటానికి భయపడుతుంటారు. పోలీసులు కూడా ఏమి చేయలేకపోతుంటారు. ఈ భయంతో గ్రామంలో జరగాల్సిన అమ్మవారి జాతర కూడా  5 సంవత్సరాలుగా నిలిపివేస్తారు. 
ఇక ఆ గ్రామానికి, సహజంగానే ఎంతో భయస్తురాలైన కనకం ఎన్నాళ్ళ నుండో ఖాళీగా ఉన్న కాన్స్టేబుల్  ఉద్యోగంలో చేరటానికి వస్తుంది. తరువాత చంద్రిక అనే ఓ పెద్దింటి కూతురు కూడా తప్పెటగుళ్లు నేర్చుకోవటానికి వస్తుంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడి తక్కువ రోజుల్లోనే మంచి స్నేహితులుగా అవుతారు. 

ఈ పాటికే మీకు పూర్తి కథ అర్ధమయ్యే ఉంటుందనుకుంటాను😊. నిజమే అలా తప్పిపోయిన చంద్రికను తీసుకువస్తుందా లేదా అనేది ఈ శ్రేణి కథ . 

విశ్లేషణ : 

ఈ శ్రేణికి పూర్తి సస్పెన్స్ తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించే అవకాశం చాలా వుంది కానీ పేలవంగా నడిచినట్టు అనిపించింది. ఉత్సాహం లేదా ఉద్రేకం రేపే సన్నివేశాలు పెద్దగా లేవు అనిపించింది. మొదటి నుండి సాదాగా సాగే ఈ శ్రేణి భాగాలలో ఓ 2 లేదా 3 భాగాలు కొంచం ఆసక్తిగా ఉంటాయి. ఆఖరి భాగంలో చూపించే మలుపు తప్పించి పెద్దగా ఆకట్టుకున్నది లేదు. బహుశా విరాటపాలెం:పి.సి.మీనా రిపోర్టింగ్ శ్రేణిని చూసిన ప్రభావం అయ్యి ఉండవచ్చు. 

అక్కడక్కడా వర్ష బొల్లమ్మ మరియు రాజీవ్ కనకాలల నటన కొంచం ఆకట్టుకుంది. అవసరాల శ్రీనివాస్ కూడా తన స్థాయికి తగినట్టు నటించి న్యాయం చేసారు. దర్శకత్వం పరవాలేదు అనిపించింది. మంచి నాణ్యమైన చలనచిత్ర ప్రదేశాలు(పిక్చర్ క్వాలిటీ ), కళా దర్శకత్వం, ఛాయాగ్రహణం బావున్నాయి.  

ఆస్తులు  : 

  • చిన్న చిన్న సంజ్ఞలతో వర్ష తక్కువ సంభాషణలు మధ్య నటన , తనకి సహకరించే రాజీవ్ కనకాల పాత్రధారణ 
  • రాజీవ్ నటనతో కొంచం శ్రేణికి ప్రాదేశికత వచ్చింది 
  • సాంకేతికత పరంగా మంచి దృశ్యమాలికలు, ధ్వని ప్రభావాలు, సంగీతం, నేపథ్య సంగీతం, సన్నివేశాల కత్తిరింపు(ఎడిటింగ్) మెప్పించాయి.   

కుదుపులు  : 

  • సాదాగా సాగే దృశ్యాలు, హాస్యం లేదా బలమైన ఉత్కంఠ రేపే లేదా ఎదురు చూడాలనిపించే సన్నివేశాలు లేకపోవడం 
  • నిదానంగా సాగే కధనం, చంద్రలేఖ - బాబ్జి ల మధ్య వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయే ప్రేమకి ఎక్కువ ఆస్కారం ఉన్న కొంచం విస్మరించారనేల వుంది.

ఓ.టి.టి. ప్లాట్ట్ ఫార్మ్  :   ఈటీవీ విన్ 
నటీనటులు :   మేఘలేఖ, అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల, వర్ష బొల్లమ్మ     
దర్శకులు, రచయిత :  ప్రశాంత్ కుమార్ దిమ్మల    
సంగీతం :   సురేష్ బొబ్బిలి      

-- అవ్యజ్ (శంకర్) 2.9***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog