Avyaaja - Kids Coloring Book

🎨 వ్యా కిడ్స్ కలరింగ్ బుక్

ప్రపంచవ్యాప్తంగా డెలివరీతో కలరింగ్ లోకానికి మొదటి అడుగు!


మీ పిల్లల కలల ప్రపంచాన్ని రంగులతో నింపే ప్రయాణం – Amazon KDP ద్వారా విడుదల చేసిన నా మొదటి అంతర్జాతీయ కలరింగ్ బుక్


పిల్లల ఊహా శక్తికి, అభివృద్ధికి, కలలు నెరవేర్చుకునే మొదటి మెట్టు - కలరింగ్ బుక్స్. ఈ భావనతోనే నేను మొదలుపెట్టిన ఒక చిన్న ప్రయత్నమే – వ్యా కిడ్స్ కలరింగ్ బుక్.

ఈ ప్రయాణం తెలుగు తల్లి పల్లె నేల నుండి మొదలైనా, ప్రపంచం అంతటా చిన్నారుల జీవిత పేజీలకు రంగుల వెలుగు అందించడమే నా లక్ష్యం.


📘 ఆలోచనలకి బీజం ? 

ఇప్పుడే ప్రారంభమైన పాఠశాలల నుండి పిల్లల అభివృద్ధికి సహాయకరమైన, వారిలో హస్తకౌశలాన్ని, ఊహాశక్తిని పెంచే సాధనమే కలరింగ్ బుక్స్. మన చిన్నప్పటి గుర్తులు, బొమ్మలు గుర్తుకు తెచ్చుకుంటే – ఎలాంటి ఆనందమో తెలుసు. అదే ఆనందం ప్రపంచం నలుమూలలా ఇప్పటి తరానికి కూడా చిన్నగా అందించాలనిపించింది.


🖥️ Amazon KDP అంటే ఏంటి?

Amazon KDP (Kindle Direct Publishing) అనేది ఎవరైనా రచయిత, సృజనాత్మకులు తమ పుస్తకాలను స్వయంగా అమెజాన్ ద్వారా ప్రచురించుకునే ఒక సులభమైన మార్గం. ఇందులో మీరు:

  • Paperback / eBook వేయవచ్చు
  • ISBN, కాపీరైట్ తీసుకోవచ్చు
  • ప్రూఫ్ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి ఉంచవచ్చు

నేను ఈ Coloring Bookను KDP లో Paperback రూపంలో అప్‌లోడ్ చేశాను – ఇది ముద్రిత రూపంలో USA, UK, AUS, కెనడా, యూరప్ వంటి వివిధ దేశాల్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.


🎨 బుక్ వివరాలు:

  • 📏 Size: 8.5 x 11 Inches (A4 Size)
  • 📄 Pages: 30
  • ✏️ Content: Easy black & white line drawings
  • 👧👦 Age Group: 2–8 సంవత్సరాల పిల్లలకు అనుకూలం
  • 🌍 Delivery: Amazon ద్వారా ప్రపంచం నలుమూలలకు


🧒 బొమ్మల ఎంపిక ఎలా?

బాలల అభిరుచికి తగినవి, సరళమైనవి, ఆకర్షణీయమైనవి కావాలని చూసాను. అందులో:

  • నీటిలో జీవించే జంతువులు
  •  నేలపై అడవిలో జీవించే జంతువులు  
  •  కూరగాయలు 
  • పండ్లు

ఇవన్నీ పిల్లలు సరదాగా, ఆనందిస్తూ వారి ఊహలకు రంగులద్దేందుకు సిద్ధంగా ఉన్నాయి.


✍️ డిజైన్ నుంచీ ప్రచురణ వరకు – స్వయంగా

ఈ బుక్ ను:

  • స్వయంగా డిజైన్ చేసాను ( Canva, MS Word వంటివి ఉపయోగించి)
  • ఉచిత ISBN  అమెజాన్ నుండి వచ్చింది 
  • Amazon KDP లో పేపర్ బ్యాక్ కొనుగోలు చేసిన వారికీ ప్రచురణకి సిద్ధంగా వుంది 
  • Preview proof చూసి Final Approval ఇచ్చాను

అన్నీ ఒక్కరుగా నిర్వహించాను, ఎందుకంటే ఇది నాకు భావోద్వేగంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్.


🌍 డెలివరీ ఎలా జరుగుతుంది?

Amazon.com & ఇతర దేశాల Amazon సైట్లలో ఇది Paperback రూపంలో అమ్మకానికి ఉంటుంది. మీరు కొనగలిగే లింక్:

👉 Click to Buy on Amazon

Amazon ప్రింట్-ఆన్-డిమాండ్ విధానంలో, మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే ప్రింట్ చేసి మీకు షిప్ చేస్తారు. USA, UK, Germany, India, ఇంకా చాలా దేశాల్లో డెలివరీ అందుబాటులో ఉంది.


📦 భవిష్యత్తులో స్కూల్స్ లో పంపిణీ

చిన్న చిన్న పట్టణాల్లో స్కూల్స్ లో ప్రత్యక్షంగా hardcopy books పంపిణీ చేసే ప్రణాళిక కూడా ఉంది. ఇప్పటికే డిజైన్ సిద్ధం – ఇప్పుడు ప్రింటింగ్, ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్ వంటివి క్రమబద్ధంగా జరపాలని నిర్ణయించాను.

ప్రతి బిడ్డ అందులో రంగులు వేసే ప్రతిసారి – ఇది నాకో విజయగాధ.


💡 ముఖ్యమైన లక్షణాలు:

✅ చిన్నారుల హస్తకౌశలానికి అనువుగా
✅ తల్లిదండ్రులకు గిఫ్ట్ గా ఇవ్వదగినది
✅ స్కూల్స్, ప్రీ-కె.జి, ఎన్జీఓలకూ వాడదగినది
✅ సాధారణ ధర – అమెజాన్ లో లభ్యం
✅ కలర్ కవర్ తో ఆకర్షణీయంగా


📈 మీకు ఎలాంటి ఆదాయం వస్తుంది?

Amazon KDP ద్వారా మీరు ప్రతీ బుక్ అమ్మకానికి రాయల్టీ పొందుతారు affiliate మార్కెటింగ్ ద్వారా లేదా  నన్ను ప్రత్యక్షంగా అయినా సంప్రదించండి . 


🧩 భవిష్యత్తు ప్రణాళికలు

తెలుగు అక్షరాలు కలిగిన కలరింగ్ బుక్

  • డిజిటల్ డౌన్‌లోడ్ వర్షన్
  • Thematic series (Nature pictures , Festivals, Numbers)
  • India-specific culture బొమ్మలు


మీ మద్దతే మాకు పెద్ద ప్రోత్సాహం

మీరు ఒక పిల్లవాడికి ఈ బుక్ గిఫ్ట్ ఇచ్చినప్పుడే – ఒక భావోద్వేగాన్నీ, ఒక సృజనాత్మకతనూ ప్రేరేపిస్తున్నారన్న మాట!

మీ అభిప్రాయాలు, సమీక్షలు, ఫోటోలు మాతో పంచుకోండి.

📧 sankar.mbs@gmail.com
🌐 Blog: avyaja.blogspot.com
📘 Book: https://www.amazon.com/dp/B0FH9ZYMX8


రంగుల ప్రపంచంలోకి మీ పిల్లల అడుగులు వేయించండి – అవ్యాజ కలరింగ్ బుక్ తో! 🎨🌈

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog