(ఎ)లెవన్
ఈ మధ్య పోలీస్ పాత్రలు పోషిస్తున్న అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర నటనలో ఇటీవలి తమిళ చిత్రం. ఈ మే నెలలో థియేటర్ లో విడుదలయి విమ్మర్శకుల ప్రశంశలు అందుకున్న చిత్రం అనే చెప్పాలి. ఈ చిత్రం తెలుగులో ఆహా, అమెజాన్ ప్రైమ్ ప్లాట్ ఫార్మ్ ఓటిటి లో విజయంవంతంగా ఈ నెల 13 నుండి ప్రదర్శితమవుతోంది.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లెర్స్ ట్రెండ్ ఈ మధ్య సాగుతూ ఉండటం కొంతవరకు కలిసొస్తుందని ఆలోచించిన దర్శకుడు లోకేష్ అజిల్స్ ఈ చిత్రాన్ని తమిళ తెలుగు భాషల్లో విడుదల చేసారు.
కథాకమామీషు
అజిల్స్ లోకేష్ దర్శకత్వ ప్రతిభ, పకడ్బందీ స్క్రిప్ట్ ఈ చిత్రానికి కూసంత బలాన్ని చేకూర్చాయి. ఓ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆధికారిగా విశాఖపట్నం వచ్చిన నవీన్ చంద్ర అతితక్కువ సమయంలో మంచి పేరుని తెచ్చుకోవటంతో అప్పటివరకు రంజిత్ (శశాంక్) విచారణ చేస్తున్న వరుస హత్యల కేసులో జరిగిన ప్రమాదం వలన ఆ కేసుని అరవింద్ కు అప్పగించటంతో కథ మొదలవుతుంది.
ఆ కేసుని ఎలా విచారించాడు అనేదే చిత్రం పూర్తి కథ అయినప్పటికీ ఆ విచారణ విధానంలో వున్నా మలుపులు, నవీన్ చంద్ర నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆలా జరిగే ప్రయత్నంలోనే వచ్చే జరిగే తన గతంలో జరిగిన సన్నివేశాలు పూర్తి భావోద్వేగంతో సహా మలుపులతో కూడిన కథనం తరువాతి కథలో ముగింపు ఏమిటి నేయి చిత్ర ప్రధాన అంశాలు.
విశ్లేషణ
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలలో సాధారణంగా ఉండే హత్యలు లేదా వరుస సైకో కిల్లింగ్ వంటివి ప్రధానాంశంగా మలిచే విధానంలోనే దర్శక ప్రతిభ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి చిత్రమే ఇది కూడాను. నవీన్ చంద్ర కేసుని విచారించే తీరు ఆకట్టుకుని ఉద్వేగాన్ని ఉత్సుకతని రేకెత్తిస్తుంది. ఆ వరుస హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేది చిత్రం చివరి వరకు దాచిపెట్టి కథను నడపడంలో ప్రతిభ కనపడింది. చిత్రం ఆఖరులో ఇచ్చే మలుపు ముందుగా ఊహించలేని విధంగా కథలో ప్రేక్షకుడిని లీనం చేసారు.
సస్పెన్స్ కి సరిపోయే నేపథ్య సంగీతం అందించిన సంగీత దర్శకుడికి (ఇమాం) కూడా మార్కులు వేయవచ్చు. సినిమాటోగ్రఫీ, కెమెరామెన్ పనితీరు బావుంది. అచ్చమైన ద్విభాషా చిత్రం, ఎందుకంటే తమిళ్, తెలుగు పదాలకి (డబ్బింగ్) అనుకరణలో దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రశంసించవల్సిన విషయం. లెవెన్ అనే పేరు పెట్టడంలో ఉన్న సరైన అర్ధం ద్వితీయార్థంలో ప్రేక్షకుడికి తెలుస్తుంది.
ఆస్తులు
నవీన్ చంద్ర చేసిన నటన, లోకేష్ దర్శకత్వ ప్రతిభ, పకడ్బందీ అయిన స్క్రిప్ట్. చివరికంటా సాగినఆతురుతలో సామాన్య ప్రేక్షకుడి ఆలోచనలకి అందని ముగింపు, శశాంక్ పాత్ర చివరిలో-మొదటిలో ఉన్నప్పటికీ ప్రాధాన్యత ఎక్కువ ఉండటం, కానీ నాయకి (రియా హరి)కి రెండవ భాగంలో కథకి కీలకమైన మలుపు లేదా ముగింపు ఇవ్వడంలో ప్రాధాన్యత
కుదుపులు
సాదాగా సాగే ప్రథమార్ధం, నాయిక నాయికల మధ్య వున్న ప్రేమ సన్నివేశాలు మధ్యలో ఇరికించినట్టు అవసరమా అనిపించాయి, అందమైన నాయికా లోపం
ఓ.టి.టి. ప్లాట్ట్ ఫార్మ్ : ఆహా, అమెజాన్ ప్రైమ్
నటీనటులు : నవీన్ చంద్ర, శశాంక్, రియా హరి, అభిరామి, దిలీపన్, రవివర్మ తదితరులు
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.