సంక్రాంతికి వస్తున్నాం
సంక్రాంతికి వస్తున్నాం అంటూ అనిల్ రావిపూడి చేసిన హడావిడి వర్కవుట్ అయిందా లేదా చూద్దాం.
ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలతో హిట్ కాంబినేషన్ గ పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి , విజయానికి ఇంటిపేరుగా పెట్టుకున్న విక్టరీ వెంకటేష్ ద్వయం సరదాగా సంక్రాంతికి తీసుకొచ్చిన చిత్రమే సంక్రాంతికి వస్తున్నాం.. మరి ఆ సరదా కధా కమామీషు ఏంటో ఇప్పడు తెలుసుకొందాం ...
కధా కమామీషు
ఒక అనాధ అయిన వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ అవటం, స్ట్రిక్ట్ ఆఫీసర్ గ ఉంటూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకొని ఓ కేసు విషయంలో సస్పెండ్ చేస్తారు. ఇదంతా గతం. ఓ ప్రముఖ వ్యాపారవేత్త సత్య ఆకెళ్ళ (అవసరాల శ్రీనివాస్) ఫారెన్ నుండి పెట్టుబడుల కోసం తెలంగాణకి సి.ఎం. తీసుకురావటంతో అతన్ని కిడ్నప్ చేయటంతో కధ మొదలవుతుంది. సాధారణ కుటుంబంలో ఉంటున్న భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్)ని పెళ్లి చేసుకొంటాడు వెంకటేష్ (యాదగిరి దామోదర రాజు).
ఆ తరువాత ఆ కేసుని డీల్ చేస్తున్న మీనాక్షి ఈ సత్య ఆకెళ్ళ కిడ్నాప్ విషయమై సూపర్ ఆఫిసర్ అయిన వెంకటేష్ సహాయం కోసం రావడంతో జరిగిన ప్రేమ వ్యవహారం బయటపడుతుంది. అక్కడి నుండి జరిగే సన్నివేశాలు మొత్తం పూర్తి హాస్యంతో చివరి వరకు నవ్వులతో గడిచిపోతుంది ఈ చిత్రం.
ఈ కేసులో రాజుకి సహకరించేందుకు వచ్చిన జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీనా (మీనాక్షి చౌదరి)నే తన భర్త మాజీ ప్రేయసి కావడంతో భాగ్యం నిఘాపెడుతుంది. అక్కడ మొదలౌతుంది గిలిగింతలుపెట్టే.. టిపికల్ ఫన్నీ ట్రై-యాంగిల్ ఆడాళ్ళ గిల్లికజ్జాల ఇన్వెస్టిగేటివ్ లవ్ స్టోరీ.. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో రాజు, మీనాల కెమిస్ట్రీని చూడలేని పాత్రలో సహజత్వంతో భాగ్యలక్ష్మి బాగ ఒదిగిపోయింది. తాను కూడా ఇన్వెస్టిగేషన్‌లో భాగం అవుతానని కండిషన్ పెట్టి, హీరో - ఇద్దరు నాయికలతో కలిసి ముగ్గురు చేసిన ప్రయాణం హాస్యాస్పదం. ఇల్లాలు ప్రియురాలుల కయ్యాటల మధ్యలో కేసుని ఫన్నీగ ముగించిన వైనం ఏంటి అన్నదే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అసలు కథ.
వివరణ :
అనిల్ రావిపూడి మార్క్ తెలిసిన ప్రేక్షకులు ఆనందంతో రావటం గ్యారంటీ . పండగంటే ఆనందము ఆనందంగా వున్న వాళ్ళు నవ్వడం ఆకర్షణ. మంచి పల్లెటూరి వాతావరణం కుటుంబ నేపధ్యంలోని సన్నివేశాలు ప్రథమార్థంలో నవ్వులు పూయించింది, పేరు వచ్చిన రెండు (మీనా, గోదారి గట్టు మీద) పాటలు మొదట్లోనే ప్రేక్షకుడికి రివీల్ చేయటం ఆరాటం పెంచిన రెండవ భాగం కొంచం హాస్యం తగ్గించి కధ ముగింపు పైన దృష్టి పెట్టాడు. ఐశ్వర్య రాజేష్ తనకి ఇచ్చిన, వచ్చిన ప్రతి చిత్రంలో కొత్త కొత్త వ్యత్యాసం ఉన్న అన్ని పాత్రలకి న్యాయం చేస్తూ దూసుకుపోతుండటం తెలుగు పరిశ్రమకి పెద్ద ఆస్తి అనే చెప్పాలి. ఇక సన్నాయి వంటి నడుముతో, ఫ్యాషన్ మోడల్ వంటి ఫిగర్ కలిగిన మీనాక్షి చౌదరి కూడా రాబోయే టాలీవుడ్ హాట్ హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. అక్కడక్కడా చిన్న పిల్లవాడితో చేయించిన హాస్యం పండిన కూడా వయసుకి తగని మాటలు అనిపించినా ఫ్లో లో కొట్టుకొనిపోతాయి. ఎక్కడ అశ్లీలతకు తావులేకుండా జాగ్రత్త పడిన అనిల్ రావిపూడి దర్శకత్వానికి పాత్రలను మలిచిన తీరు అందరికి సరి అయిన న్యాయం చేయటం చెప్పుకోదగ్గ విషయం.
ఆస్తులు :
భార్యగా ఐశ్వర్య రాజేష్ తన పాత్రకి నటనతో చేసిన న్యాయం, మీనాక్షి కొంత తేలిపోయినప్పటికీ అందం మంచి ఆకట్టుకునే ఫిగర్ కోసం, పోలీస్ ఆఫీసర్ పాత్రని సృష్టించినట్టుంది. చిత్రానికి హైలైట్ అయిన 3 పాటలు, నేపథ్య సంగీతం ( బాక్గ్రౌండ్ మ్యూజిక్ ), కధ మొదటి నుండి ఒకే ర్యాంప్ కొనసాగించటం, అశ్లీలత చాలా తక్కువున్న హాస్యం, కుటుంబ తరహా సన్నివేశాలు
కుదుపులు :
తన పేరు, రియల్ లైఫ్లో ఉన్న స్థాయిని తగ్గించుకుని అక్కడక్కడా వెంకటేష్ చేసిన విన్యాసం, అక్కడక్కడా కనిపించే అనుకరించినట్టు (కాపీ) అర్ధం అయ్యే సన్నివేశాలు, కొత్తదనం ఆశించలేకపోవటం
నటీనటులు : ఐశ్వర్ రాజేష్, మీనాక్షీ చౌదరి, వెంకటేష్, సీనియర్ నరేష్, సాయికుమార్, శ్రీనివాస్, ఇతర తమిళ, కన్నడ, హిందీ నటులు
దర్శకుడు: అనిల్ రావిపూడి
సంగీతం : భీమ్స్ సిసిరోలియోస్
బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : శిరీష్
-- అవ్యజ్ (శంకర్) 3.111111 ***/5*****
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.