కాఫీ విత్ ఎ కిల్లర్ (ఆహా)
ఆకర్షణీయమైన టైటిల్ కదా? మనకి బాగా తెలిసిన నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడూ, రచయిత ఇలా అన్నీ కలిపి ఇంకా దర్శకత్వంలో కూడా అడుగు పెట్టిన మన పాటల మాంత్రికుడు ఆర్.పి.పట్నాయక్ కొత్తదనంతో కూడిన కధతో కాస్త దగ్గరగా మలయాళ చిత్రాలలో ఎక్కువగా చూస్తున్న కధాంశంతో రూపొందించబడింది.
అలా మన తెలుగు ఓ.టి.టి. బుల్లితెర వేదిక ‘ఆహా’లో ప్రదర్శనకు వచ్చిన అచ్చ తెలుగు చిత్రమే ఈ “కాఫీ విత్ ఏ కిల్లర్”. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ సమీక్షలో చదివేద్దాం రండి.
థ్రిల్లర్ నేపధ్యానికి హాస్యం జోడించి తీసే చిత్రాలు ఈ మధ్య కాలంలో కొంచం ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకులకు చేరువవుతున్నాయనే చెప్పాలి. అలాంటి చిత్రమే ఈ “కాఫీ విత్ ఏ కిల్లర్” కూడా.
కథాకమామీషు:
ఒక వృత్తి పరంగా చేయి తిరిగిన హంతకుడు అయినటువంటి (టెంపర్ రవి) తన వృత్తిలో భాగంగా సుపారీకి (రొక్కం తీసుకొని హత్యలు చేసే పద్దతి) ఓ (కాంట్రాక్టు) ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన అవకాశంతో ఓ కాఫీ కేఫ్ లో హత్య చేయాల్సి ఉంటుంది. అదే కేఫ్ లో ఇంకా కొన్ని అంశాలు చుట్టు ముట్టి ఉంటాయి. ఆ కేఫ్ మేనేజర్ - ఓ జంట, ఓ మనీ మాఫియా లావాదేవీ, ఓ భూ వివాదం, ఓ ప్రేమ వ్యవహారం, ఓ చిత్ర రచయిత - నిర్మాత - దర్శకుడు - నటుడు, ఓ జ్యోతిష్యుడు - జాతక సమస్య కల వ్యక్తి ఇలా అన్నిటి మధ్య సమాంతరంగా అదే కేఫ్ లో సన్నివేశాలు జరుగుతుంటాయి. ఆ హంతకుడు ఎవరిని చంపటానికి వచ్చాడు? అతనిని ఆ కేఫ్ లో ఉన్నవారితో దర్శకుడు ఎలా కలుపుతాడు? చివరికి ఏం చెప్పాలి అనుకున్నాడు ఈ కధతో? ఆ హంతకుడి తుపాకీ నుండి వచ్చిన గుండు (బుల్లెట్) బలి తీసుకున్న వ్యక్తి ఆ కేఫ్ లోనే ఉంటారా? కాధాంతంలో ఆ బులెట్ చెప్పిన విషయమేమిటి అనేది చిత్రంలో చూడవలసిన కధ.
విశ్లేషణ:

ఆస్తులు :
కిల్లర్ టెంపర్ రవి నటన, కధని పాత్రల మధ్య ఎవరికి వారికీ నప్పేలా తీర్చిదిద్దటం, డీసెంట్ స్క్రిప్ట్, ఆటో రాంప్రసాద్, జెమిని సురేష్ మధ్య జబర్దస్త్ తరహా హాస్య సన్నివేశాలు, శుభ్రమైన సినిమాటోగ్రఫీ
కుదుపులు:
ఉన్నంతలో కధ బాగానే ఉన్న కధనంలో ఇంకొంచం వెలితి, ప్రేమజంట మధ్య లేని రొమాన్స్, చిత్రాన్ని చిత్రంలా చూడాల్సిందే, రచన కోసమే పాత్రలన్నిటిని కలిపినట్టు అనిపించే కధ
నటీనటులు : అవంతిక, శ్రీ రాపాక, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ఆటో రాంప్రసాద్, రవిబాబు తదితర తెలిసిన నటులు
దర్శక, సహ రచన, వాయిస్ ఓవర్ : ఆర్. పి. పట్నాయక్
నేపధ్య సంగీతం : భరత్ మధుసూదన్
నిర్మాత : సెవెన్ హీల్స్ సతీష్
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.