మిస్టర్.మాణిక్యం
" అన్ని ఉన్నపుడు కడుపు నిండినపుడు ఎవరైనా విలువలు గురించి మాట్లాడుతారు. చేతికందివచ్చిన అవకాశం, పేదరికం, బాధ్యతలతో కూడిన అవసరం ఉన్నపుడు కూడా విలువలకు నిలబడేవాడే నిజమైన మనిషి. "
సముద్రఖని ప్రధాన పాత్రలో మలయాళ నటి అనన్య కధా నాయికగా భార్య పాత్రలో వచ్చిన ఇటీవలి తమిళ చిత్రం ఈ తిరుమాణిక్యం. జనవరి 24 నుండి జీ - 5 ఓ.టి.టి.వేదికగా ప్రదర్శితమవుతోంది.
ఆధునిక యుగంలో అయినా నిజాయితీకి నిలువ ఉంటుంది అనే కధాంశంగా తీసుకొని రాసిన నిర్మించిన ఈ చిత్రం. గత నెలలో విడుదలయిన ఈ చిత్రం సూపర్ స్టార్ రజనికాంత్ యొక్క అభినందన ప్రశంసలు కూడా అందుకుంది.
కథా కమామీషు
సముధ్రఖని ప్రధాన పాత్రలో ఓ అనాధగ నటించి మెప్పించిన ఈ చిత్రం ఓ నిజాయితీ గల పేద దుకాణదారుడు సాధించిన విజయం, నడుచుకొన్న జీవన విధాన విలువలతో కూడిన కధా సారాంశం. పరుగుల ఉరుకుల జీవనంలో, ఆధునికత పేరుతో మారుతున్న , విలువలు మరిచిపోతున్న ఈ యుగంలో చెప్పుకోబడిన చిత్రం.
స్వచ్ఛమైన హృదయం ఉన్న ఆవుతో సమానమైన బ్రతుకును సాగిస్తూ, తన కుటుంబం మరియు సమాజం నుండి అనేక సవాళ్లను ఎదుర్కొనే నిజాయితీ గల ఓ లాటరీ టికెట్ అమ్ముకునే వ్యాపార విలువలున్న వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్ర కథనం నాయకుని సమగ్రత సమాజంచేత ఎలా పరీక్షించబడుతుందో మరియు అది సృష్టించే అలజడుల ప్రభావాలను విశ్లేషిస్తుంది. డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆలోచింపజేసే అంశంతో సందేశాత్మక చిత్రాల కోవలో నిలిచి మెప్పించింది.
ఓ అనాధ అయిన (సముద్రఖని) బాలుడి చేత దొంగతనం మాన్పించి నాజర్ చేరతీయటంతో మంచి విలువలు సమాజంపై వ్యక్తులపై ఎలా ప్రభావం చూపుతాయి, వాటిని ఎలా ఉపయోగపడాలా చేయాలి అనే బీజం నాటుకుంటుంది ఆ పిల్లాడి మనసులో. అటుపైన ఆ పిల్లడు పెరిగి లాటరీ వ్యాపారం చేస్తూ ఉండగా ఓ పేద ముసలి కొనుగోలుదారుడు (కస్టమర్) లాటరీ టికెట్ కొనటం, పిమ్మట జరిగిన సన్నివేశాలు ఏంటి? వాటినుండి , తన ఫ్యామిలీ నుండి ఆ విలువలని ఎలా కాపాడుకున్నాడు ? తరువాత జరిగిన మంచి ఏంటి అనేది ఈ చిత్ర కధ ?
సముద్రఖని, నాజర్, వడివుక్కరాసి, భారతీరాజా, తంబి రామయ్య, కరుణాకరన్ వంటి స్టార్ తారాగణంతో పాటు నేటి నటి అనన్య తో దర్శకుడు నంద పెరియసామి తీసిన చిత్రం తిరు.మాణిక్యం, దాని పదునైన కథాంశం మరియు ఆకట్టుకునే ప్రదర్శన కోసం విస్తృత ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.
![]() |
సూపర్ స్టార్ రజనీకాంత్ విడుదల చేసిన ప్రశంసా పత్రం నకలు (కాపీ) |
విశ్లేషణ:
ఈ చిత్రంలో కధలో కొత్తదనం లేని సందేశం ఇచ్చినా తీసుకున్న పూర్వ కధా అంశం ఓ పెద్ద ఆస్తి. దానికి తోడు పేరున్న నటులు దర్శకులు కూడా తమవంతు నటించి భాగస్వామ్యంలో సహాయం చేసారు. ఇక సముద్రఖని నటనలో ఆరితేరుతూ అందివచ్చిన అన్ని పాత్రలను చేస్తూ అటు తమిళ, ఇటు తెలుగు చిత్ర రంగాలలో ఎదుగుతున్న నటుడు. ఇటీవలి విమానం చిత్రంలో తండ్రి పాత్రలో మెప్పించి ఇప్పుడు ఈ చిత్రంలో (తిరుమణికేమ్) వ్యాపారిగా నిజాయితీని చూపిస్తూ ప్రశంసలు అందుకున్నాడు. ఇక అనన్య పాత్ర నిడివి తక్కువ ఉన్నా అందులో ప్రాధాన్యత ఉంది. కధ చూస్తున్నంత సేపు ఎం చేస్తాడు అనే ఆసక్తి వస్తుంది. వెనకడుగు వేసే సందర్భాలు ఉన్నాయి. డబ్బే పూర్తి లోకాన్ని నడిపిస్తున్న రోజుల్లో కూడా పూర్తి అవకాశం ఏమి రుజువు చేయలేని పరిస్థితులున్నా ఎలా నిజాయితీకి నిలబడ్డాడు అనేది ఒకటైతే, దానికి సహకరించేది చిన్న విషయమైనా కూడా అప్పటికి అదే పూర్తి సహకారం అని నిశితంగా ఆలోచించే వారికీ తెలుస్తుంది.
కుదుపులు
పాటలు, యుగళ గీతానికి లేని ఆస్కారం అవకాశం, హాస్యం లోటు
ఆస్తులు
మంచి కధ, చిత్రీకరించిన విధానం, భావోద్వేగ అంశాలు, నిజ జీవితానికి ఉపయోగపడే నాలుగు మంచి మాటలు, ఫోటోగ్రఫీ, సముద్రఖని అనన్యల నటన
నటీనటులు : సముద్రఖని,అనన్య , వడివుక్కరసి, నాజర్,భారతీరాజా
దర్శక, రచన: నంద పెరియసామి
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాత : జి. పి. రవికుమార్, చింత గోపాలకృష్ణ రెడ్డి
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.