Min Mini

మిన్ మిని- ఈటీవీ విన్ 

కోలీవుడ్ సంచలన చిత్రం దృశ్యం - చిన్న కూతురు, నటి ఎస్తర్ అనిల్ ప్రధాన నాయకి పాత్రలో, తమిళ మాతృకలో విడుదలయి  మరియు సందేశాత్మక చిత్రాల వరుసలో మిన్ మినీ గత నెల 16 నుండి ఈటీవీ విన్ ఓ.టి.టి ప్లాట్ ఫామ్ లో ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రం నేరుగా ఓ.టి.టి.లో తెలుగులో విడుదలయింది. 

Actress Anil Esthar

నిజానికి ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకున్నది అనటంలో సందేహం లేదు. చిత్రం కోసం దర్శకురాలు చేసిన ప్రయోగం, నాయికా నాయకులూ నిజమైన వయసు, ఆహార్యం కోసం ఎటువంటి సృజనాత్మక లేకుండా రియల్ లైఫ్ లో ((పాఠశాల వయసు, యుక్తవయసు )) దాదాపు ఏడు సంవత్సరాలు వేచి చూసి రెండు భాగాలుగా  ఈ చిత్రాన్ని నిర్మించింది.  

కథా కమామీషు

ఎస్తర్ అనిల్ ప్రధాన పాత్రలో స్నేహితునితో స్నేహంకోసం, జరిగిన ఓ హిమాలయ పర్వత రహదారి ప్రయాణపు కధా సారాంశం ఈ చిత్రం. అసలు ప్రవీణ (ఎస్తర్ అనిల్ ), ప్రవీణ్ కిశోర్ ద్విచక్ర వాహనం పైన హిమాలయ పర్వత రహదారులలో చేసిన ప్రయాణం ఎందుకు, ఆ అవసరం ఎలా వచ్చింది? దారిలో వారి మధ్య జరిగిన సంఘటనల సారాంశమే ఈ చిత్రం. పారి మనికార్, శబరి ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య జరిగిన భావోద్వేగ సన్నివేశాలు, వారికి ప్రవీణకు కలిగిన బంధం ఏమిటి అనేవి ఈ చిత్రానికి మూలాధారం. 
శబరీ, పారి మనికార్ ఇద్దరు చిన్నతనంలో సహ విద్యార్థులు. శబరి చెస్ ఛాంపియన్, పారి అప్పటికే ఆటల్లో ప్రధమంలో ఉంటూ పాఠశాలకు ఎన్నో పథకాలు తీసుకొస్తుంటాడు. అలాంటి పారికి కొత్తగా చేరిన శబరీని ఉపాధ్యాయులు తనతో సమానంగా పొగడటం పెద్దగా నచ్చకపోవడంతో ఆట పట్టిస్తూ ఉంటాడు. అది వారిద్దరి మధ్య స్నేహానికి ఎలా దారితీసింది అనేవి సున్నితమైన భావోద్వేగ అంశాలు. తరువాత అదే పాఠశాలలో ప్రవీణ కూడా చేరటానికి గల కారణాలు, శబరీ-ప్రవీణల మధ్య జరిగే సంఘటనలతో పెరిగి పెద్దయిన తర్వాత వారి జీవితంలో సాగే ప్రయాణాన్నీ ఈ చిత్రంలో చూడాలి. 

Esthar

విశ్లేషణ:

ప్రవీణ - శబరిల మధ్య చిన్నపుడు పాఠశాలలో ఏర్పడిన మౌన సంబంధం చిత్రం చివరి వరకు సాగుతుంది. వారిద్దరూ హిమాలయాలకు వెళ్లినప్పటి సన్నివేశాలు కొన్ని పాత జ్ఞాపకాలతో సాగే పర్వత విహారం ఆ ప్రయాణంలో చూపిన సన్నివేశాలు బావుంటాయి. దర్శకురాలు భావ వ్యక్తీకరణలో లోటు ఏమి కనిపించలేదు. కాకపోతే ఆసాంతం చూడటానికి కొంచం ఆశ్చర్యం అనిపించింది. కానీ కధని అల్లుకున్న విధానం బావుంది. పాఠశాలలో శబరీ - పారి ల మధ్య సాగే సన్నివేశాలు అల్లరిగా ఉన్నప్పటికీ చివరలో వారి మధ్య బంధాన్ని అనుకోకుండా కలపడంలో దర్శకురాలిగా, రచయితగా విజయం సాధించారు. మంచిని చెపుతూ స్నేహానికి అర్ధాన్ని తెలిపారు. చిత్రం చూసాక ఇదేనా అనిపించినా, చూసేటప్పుడు ప్రేక్షకుడు కధలో లీనమవుతాడు. ఊహించని సన్నివేశాలు పెద్దగా లేకపోయినా సందేశాత్మకం స్నేహ బంధం నిలపటం కోసం వారు చేసే ప్రయత్నం, ప్రయాణం చివరికి ముగించిన విషయం బావుంది. హిమాలయాలు, వాటి అందాలు అక్కడక్కడా కనువిందు చేస్తాయి.

 కుదుపులు 

ఫ్లాట్ గా సాగే కధనం, యుగళ గీతానికి లేని ఆస్కారం అవకాశం, హాస్యం లోటు

ఆస్తులు  

హిమాలయ పర్వత రహదారి ప్రదేశాలు, ఆ ప్రకృతి అందాలు, ఫోటోగ్రఫీ, హృద్యమైన సన్నివేశాలు, స్నేహశీల బంధాలు, ఎస్తర్ అనిల్ లేత అందం, ఖతిజ రహమాన్ వారసత్వ పేరు

నటీనటులు :  ఎస్తర్ అనిల్, ప్రవీణ్ కిశోర్ , గౌరవ్ కాలయి,   
దర్శక, రచన:  హలీత షమీమ్     
సంగీతం :  ఖతిజ  రహమాన్ (d/o ఏ. ఆర్. రహమాన్ )    
 
నిర్మాత : మనోజ్ పరమహంస (సినిమాటోగ్రఫి ), మురళి కృష్ణన్    

-- అవ్యజ్ (శంకర్) 3***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog