Sookshma Darshini - Disney+

 సూక్ష్మ దర్శిని - హాట్ స్టార్

నజ్రియా నజీమ్ - మలయాళంలో ఈమెకి ఉన్న క్రేజ్ ఎవరికి తెలియనిది కాదు. అలానే బాసిల్ జోసెఫ్ కి ఉన్న ఇమేజ్ కూడా తీసేసేలా ఏమి లేదు. అలంటి వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన చిత్రం  'సూక్ష్మదర్శిని'. గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన థియేటర్లలో విడుదలయి 55 కోట్ల వరకూ రాబట్టిన ఈ చిత్రం, నిన్నటి నుండి అంటే 10వ తేదీ నుంచి 'డిస్నీ+హాట్ స్టార్' లో ప్రసారం అవుతోంది. 

Nazia Insta

కధా కమామీషు: 

ప్రియా (నజ్రియా) ఆంటోని (దీపక్)  భార్యాభర్తలు, ఆంటోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ప్రియా తన ఇద్దరు స్నేహితురాళ్లతో స్టెఫీ - ఆస్మాలతో తన కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటుంది. చాలా కాలం క్రితం ఊరు నుంచి వెళ్లిపోయిన మాన్యుయల్ (బాసిల్ జోసెఫ్), తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన తిరిగి ఆమెను తీసుకుని ప్రియా వాళ్ళు ఉంటున్న అదే కాలనీకి వస్తాడు.

ప్రియా వాళ్ళ ఎదురు ఇంట్లో ఉంటున్న మాన్యుయేలు అతని అమ్మకి అల్జీమియా వ్యాధీ ఉన్నదని అప్పుడప్పుడు మతిమరుపు వలన ఇల్లు మరిచి పోయి వేరే ప్రదేశాలకు వెళుతుంటుందని, తాను వెతికి తీసుకొని వస్తు ఉంటానని అక్కడి వారికి చెప్తాడు. కానీ అది ప్రియకి నమ్మశక్యంగా ఉండదు. అంతే కాక మాన్యుయేలుతో పాటు వాళ్ళ అమ్మ ప్రవర్తనలో మార్పులు బేరీజు వేసుకుని అవి అనుమానాస్పదంగా ఉండటం ప్రియా కనిపెడుతుంది. 

ఇలా జరుగుతుండగా ఓ రోజు మాన్యుయేలు అమ్మ ఇంటి నుండి వెళ్లిపోయిందని 4 రోజుల నుండి వెతుకుతున్న కనిపించలేదు అని కాలనిలో అందరు అనుకుంటుండగా ప్రియకి అనుమానంగా ఇంట్లోనే తాను ఉన్నట్లు చూస్తుంది. అక్కడే అసలు కదా మొదలవుతుంది. ప్రియా చూసింది ఎవరిని? తాను అనుమానించినట్లు ఏదైనా అసందర్భంగా జరుగుతున్నాయా అనేవి చిత్రంలో చూపించారు. చివరికి ఏం జరిగింది అనే త్రిల్లర్ కధా కోణంలో చిత్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు దర్శకుడు. 

గ్రామీణ పరిసరాల్లో జరిగే ఈ కధ, సాధారణంగా పట్టణాల్లో పక్కవాళ్ళ ఇళ్లలో ఏం జరిగిన పట్టించుకోరు అనే విషయానికి భిన్నంగా పల్లెటూర్లలో ఏ చిన్న విషయమైనా వూరు మొత్తం తెలుస్తుంది అనేలా చెప్తూ , టైటిల్ కి తగినట్టు ఈ చిత్రంలో నటీమణి సూక్ష్మంగా చేసిన పరిశీలన ఆ ఇంటి రహస్య వ్యవహారాన్ని ఎలా బయటపెట్టింది, అసలు ఆ మాన్యుయేలు ఇంట్లో ఏం జరుగుతుంది అనేవి చిత్రంలో దర్శకుడు  చూపించారు. 

Amz Ad

విశ్లేషణ: 

పాత్రల పనితీరు బాగానే ఉంది. కాకపోతే చెప్పినంత థ్రిల్ తీసుకురావడంలో దర్శకుడు కొంచం విఫలం అయినట్టే ఉన్నాడు. చివరిలో కొంచం ఆసక్తి రేపే సన్నివేశాలు ఉన్నాయి అనిపించింది. పాటలు హాస్యం అనుకున్నంతగ కన్నా అసలు లేవు అనే చెప్పచ్చు. తక్కువ పాత్రలతో వున్న పరిధిలో పెట్టిన ఖర్చు కంటే ఎక్కువగా కథను జోడించి చిత్రాన్ని మంచిగానే తెరకెక్కించాడు అని అయితే చెప్పవచ్చు. 

ఆస్తులు :

మంచి కథ , కథనం , నజ్రియా నటన, అందం, బాసిల్ జోసెఫ్ఫ్ ఫేమ్, విభిన్న నటన,  ఫోటోగ్రఫి, ప్రధాన పాత్రలకి న్యాయం

కుదుపులు : 

హాస్యం లోపించడం , తగినన్ని ఆసక్తి రేపే అనూహ్య సన్నివేశాలు లేకపోవడం, ఎడిటింగ్ 

నటీనటులు :  నజ్రియా నసీం, బాసిల్ జోసెఫ్, తదితర మలయాళ నటులు 
దర్శకుడు :  ఎం.సి. జితిన్  
సంగీతం :  క్రిస్టో జేవియర్  
బ్యానర్ :  AVA ప్రొడక్షన్  

-- అవ్యజ్ (శంకర్) 2.99 ***/5***** 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog