Fashion poison/ ఫ్యాషన్ పాయిజన్

ఓ పేరున్న సాహిత్య పత్రిక ఆహ్వానించిన  " సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఫ్యాషన్ పాయిజన్" అంశం పై కవితల పోటీకి పంపిన నా కవిత.  


......... ఫ్యాషన్ పాయిజన్ ........

కంప్యూటర్ అంటారు, ఇంటర్నెట్ కాలం అంటారు కానీ ....

ఇంటికి మాత్రం దూరం అంటారు...!


తల్లి ప్రేమలో ఉందా ఫ్యాషన్.....?

తండ్రి పాలనలో ఉందా ఫ్యాషన్..?

ఫ్యాషన్ అని తల్లి తండ్రులే విడిపోతే....?

బ్రతుకేది....? భవితేది....??


" COMFORT " అని " JEANS "లట..చాలీ చాలని దుస్తులట....!

ఒళ్ళంతా కనబడే " TRANSPERENT " భావాలట..!!

అదికాదని ఇదికాదని చివరికి "లో"దుస్తులే కర్రెక్టంటారు..!


Trend అంటూ " లోహిప్స్"  పరుగెత్తే " HIP  - HOPs " !

పాటంటే ఫీట్సేగా ,  విసుగెత్తే  "POP ఏగా" !!

అలాపోయి  ఇలాపోయి చివరికి  "కూకూ" లే పాటంటారు ..! 


SWEEPERS  కి సూటులు -  BEGGAR లకి బైకులు ....!

ఇక వ్యూయర్స్ కి షాకులు ....!

ప్రతిఒక్కరి పని రీజనే ఫ్యాషన్ పాయిజన్......!


--

శంకర్ / Shankar

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog