Natural turmoil / ప్రకృతి క్షోభ

ఈ కవిత రాయటానికి ప్రేరణ కరుణ శ్రీ జంధ్యాల గారు రాసిన " పుష్ప విలాపం" అనే కవిత.  అలా ఈ రోజుల్లో అడుగంటిపోతున్న మొక్కలు, పూవులై, పండ్లయి,  కాయలై , పంట చేతికొచ్చేవరకు పడే బాధని ఓ మొక్క మనతో చెప్పుకొంటే ఎలా ఉంటుంది అని ఆలోచన రావడంతో చేసిన చిన్న ప్రయత్నం. 


గ్రాంధీకమో, సాంస్కృతికమొ అమ్మ నేర్పిన ఆంధ్రమో  కాని భావమెరిగితే చాలు జనులు ... 

------------     ప్రకృతి క్షోభ       ------------------
మొక్కనైతిని పుడమి జీల్చగ బంగారు భవిత కోసమే, అడుగుపెడితిని శైశవమ్మున గుర్తుకొచ్చిన స్నేహమ్ముతోడ !!
చెలిమి జేసితి ముద్దు ముద్దుగ పుట్టుకొచ్చిన మనుజుతోడ !
ఆటలాడుతు ఎదుగుతుండగ హాయి హాయిగా అతనితో !!
చేరువాయెను యవ్వనమున మనుజులెల్లరు తేరిచూడన్గ !
అచ్చెరువొందే చెంపతడిమిన కంటి చెమ్మతో !!
స్నేహమాయెను శత్రువుగజేరి నాడు బిడ్డడి గొంతునులుమగ !
ఆశ నొందితి ' మొగ్గ ' గున్న నాదు బిడ్డని కనులగాంచి , తెంప బ్రోవునాయని చెలిమిచెసిన నా మనుజనేస్తం !!
'కల్ల'ఆయెను కళ్ళు చెమరగ, ఆతడి ప్రేమకోసం...!! గుండెనిండా బాధకలిగెను తెరచిచూడ !!
రూపుమార్చితి ఈసడింపుగ పండువోలె బ్రతుకునేర ! మరలజొచ్చెను యాజామాని నాదు బిడ్డల జంప 'మందు' తో !!
లేత 'పిందె' ని - వలువలైనా రాని 'పండు' జూచి , మందుజల్లి త్రుంచుకెల్లె వ్యాపారమ్ము నిలువజేయ !!
ఇంత నేరమా నేను మారగ - ఆకుకూరై, కాయగూరై, 'ఇంతి' చేతిన దుంప నైనా ,
' తోలు' వలచి - గుండె' జీల్చి' , బెరడునిచ్చినా - చెరకునిచ్చినా , నీడనిచ్చే చెట్టునైనా  - ఇంట జేరే గూడునైనా !!!
చలించ రాయే నీచ మనుజులు - చెంత జేరిన స్నేహితున్ జూచి ... 
- - - - - 
ఇంత జేసినా ప్రేమ తరుగదాయే - నాదు ప్రాణం వదులుతున్నా.. నేలకొరిగి వ్రంగుతున్నా...నాదు జాతిని వదులుతున్నా చివరికంటూ కన్నీటితోడ... !
ఒక్కరైనా మెచ్చుతారని .. కొందరైనా మారుతారని .... పుడమి మెట్టిన వృక్షజాతిని కాచుతారని ...!! ... !!!  


--
శంకర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog