Who's winner ? గెలుపెవ్వరిది ఓ నేస్తం!!

ఒకరిపై ఒకరు గెలిచామని అనుకుంటూ విర్రవీగుతూ వుండే అహంకారయుత జనానికి కళ్ళు తెరిపించే ఓ పోలిక గల సమాధానం లేని ప్రశ్నల గద్యం  


గెలుపెవ్వరిది ఓ నేస్తం!!

గెలిచామని అనుకొంటామే కొంతైనా....అసలైన గెలుపెవ్వరిదో తెలుసుకోగలమా ఎపుడైనా...

ఆశల వలయంలో , ప్రతిక్షణం ఊహలతో గడుపుతూ కడుపార తిరగాడే చిన్నారికోసం,

కనులార ఆనందంతో ప్రాణాంతకమైన పురిటి నొప్పులను సైతం లెక్కజేయక తన ప్రేగు తెంచుకుని జన్మించే 

బిడ్డ కోసం ఎదురుచూసే కన్నతల్లిదా..? ( ' లేక' )


చెరగని రక్త వర్ణ కాంతితో, విశాల ప్రపంచంలోకి  అడుగిడిన చిన్నారి ముద్దైనా తీరకనే పొత్తిల్లల్లోకి

కొందరికి ఆనందం వెనువెంటనే దు:ఖం ఉందనేలా ఆ పసికందుని నిర్దాక్షిణ్యంగా కబళించే కరాళ మ్రుత్యువుదా...?


లేలేత పరువాలతో కైపెక్కించే యవ్వన సంపదతో కవ్వించిన సొగసరి స్వచమైన ప్రేమని గెలుచుకున్న ప్రియునిదా ...? ( ' లేక' )

జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవటం కోసం విధిలేని స్థితిలో ప్రేమికుని యెడల పరుషంగా మారిన ఆ ప్రియురాలి స్వచ్చమైన ఒంటరి మనసుదా.....?

జీవితం లో ఉన్నత శిఖరాలు చేరిన సాధారణ ఓ పేద తరగతి వ్యక్తిదా....? ( ' లేక' )

తన రెక్కల కష్టం తో బిడ్డల కోసం రేయింబవళ్ళు పరితపించే కన్నా తండ్రి శక్తిదా....?


శిల్పి చేతిలోని ' ఉలి ' చేసే గాయాలను సహించి శిల్పంగా మారిన ఆ రాతిదా....? ( ' లేక' )

ఆ రాతిని శిల్పంగా మార్చిన శిల్పకారునిదా....?


తన గుండెను చీల్చిన ' నాగలి ' కాఠిన్యతను సహించి సహకరి౦చిన ధరణి మాతదా...? ( ' లేక' )

ప్రకృతి విలయతాండవం చేసినా భరించి, కష్టాలకి ఓర్చి జగత్తుకు ధాన్యం పండించి ఇచ్చిన రైతన్నదా...?

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog