K.G.F.2 Review / కె.జి.ఎఫ్.- చాప్టర్ 2


 కె.జి. ఎఫ్. - చాప్టర్ 2

అందరు ఎదురు చూసిన చాలా మందికి హత్తుకున్న , యాష్ కి కమర్షియల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన కే. జి. ఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకుడు. కధా పరంగా లోటుపాట్లు ఉన్నప్పటికీ మొదటి చాప్టర్ తో పోల్చుకుంటే కాస్త తేలిపోయిందని చెప్పాలి. కమర్షియల్ యాక్షన్  ఫిలింగా మంచి మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి చాలా కారణాలు వాటిలో మొదటిది జనంలో ఉన్న హైప్. టెక్నికల్ వాల్యూస్ ఈ మధ్య అన్ని సినిమాలలో కొద్దొ గొప్పో బాగానే కనిపిస్తున్నాయి, ఉంటున్నాయి కూడా. కథ లేక పోయినా సినిమాలు బాగానే ఆడుతున్న రోజులివి. కోట్లు ఖర్చు చేయటానికి మంచి యాక్షన్ ఎపిసోడ్ దొరికింది. నటి నటులు పేరున్న వారు. ఎక్కువగా హీరో ఓరియెంటెడ్ మూవీ అవడం వలన  అన్ని పాత్రలకి పెద్ద నిడివి ఇవ్వలేరు. అవసరానికి తగినట్టు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసారు. అమ్మ కోరిక పైన సుల్తాన్ అవ్వడం, పేదరికం నుండి వచ్చిన జీవితం పైన కసితో అమ్మ చెప్పిన మాట కోసం ఆ కే.జి.ఎఫ్. మైన్స్ లోని కార్మికుల కష్టాలు తుడవడం, ఆక్రమించుకోవడం లాంటివి మొదటి చాప్టర్ లో బావుంటాయి, కానీ తర్వాత నిజానికి ఏ తల్లి, బిడ్డ అలా వాంటెడ్ క్రిమినల్లా ఉండటం ఒప్పుకోదు. ఇది కధని కంటిన్యూ చేయటానికి ఎంచుకున్న ఓ ఆకర్షణ కారణం. అంత పెద్ద గోల్డ్ మైన్ డాన్ ని, పట్టుకోవడానికి చూపిన ఆసక్తి తరువాత, బంగారంతో పాటు అతన్ని చంపడానికి గవర్నమెంట్ ఆలోచించటం ఓ రకంగా ఉంది. కే.జి.ఎఫ్. కధని అజ్ఞాతంగా నడిపించిన మంత్రి సూర్యవర్ధన్ అని, ఆ పాత్రని చంపటం కొంచం అనుకోని మలుపు. రొమాన్స్ పాళ్ళు కష్టం, పాటలు బాక్గ్రౌండ్ లో సాగిపోతుంటాయి. ఓపికగా విని ఆనందించవచ్చు. అమ్మ సెంటిమెంట్ అక్కడక్కడా అవసరం లేకపోయినా పండించి న్యాయం చేశారు. ప్రధాని పాత్రలో రవీనా టాండన్, అదీరా పాత్రలో సంజయ్ దత్ బాగా ఇమిడిపోయి నటించారు. హీరోయిన్ పాత్ర కొంచం షుమారుగా ఉంటుంది. ఇక యాక్షన్ సన్నివేశాలు గురించి మాత్రం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైనమిక్ డైలాగ్స్ కూడా బాగా నప్పుతాయి సినిమాలో... 
-- అవ్యజ్ (శంకర్)
మనకి నచ్చినా నచ్చకపోయినా కమర్షియల్ హిట్ 
వ్యక్తిగత రేటింగ్ 2.9 /5

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog