Acharya / ఆచార్య దేవోభవ

ఆచార్య 

ఫ్యాన్స్ , ఆడియెన్స్ గుండెల్లో పెద్ద ఆశలతో విడుదలైన మెగాస్టార్'స్ ఆచార్య అనుకున్న స్థాయికి చేరలేకపోయింది. మొదటి షో తరువాత నుండే పడిన ట్రోల్ల్స్ వలన పూర్తిగా ఆడియెన్స్ లో నెగటివ్ టాక్ ని అనివార్యంగా సొంతం చేసుకొంది. మొత్తానికి అందరికి తెలిసిన కాస్టింగ్ తో అంచనాలను అందుకోలేకపోయిన ఆచార్య సినిమా గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే, సమయం లేదు మిత్రమా అన్నట్టు సరైన సమయంలో విడుదల కాకపోవడమే ఫెయిల్యూర్ కి కారణమేమో అని చెప్పచ్చు. ఆర్.ఆర్.ఆర్., కె.జి.ఎఫ్ వంటి ఎఫెక్ట్స్ వున్న రజోగుణ ప్రేరిత చిత్రాల మానియాలో ఉండటమే ఇంకో కారణం.ఆచార్య :- ఆ పేరులోనే ఉంది ధర్మాన్నిబోధించే వారు అని. ధర్మాన్ని గౌరవించే వారందరూ ఆచార్యులే అవుతారు అనడంలో ఎలాంటి ఉద్దేశం ఉందో, వారందరూ ఇలాంటి సినిమాలు తప్పక చూడాలని చెప్పవచ్చు. అలాంటివి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న, జరిగిన అంశాలని అందరికి మళ్లి మళ్ళి చెప్పనవసరం లేదు. కధ బాగానే ఉన్నా పాటలు బాక్గ్రౌండ్ సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయాయనిపిస్తుంది. అక్కడక్కడా చేసిన ఎలివేషన్ షార్ట్స్ అవసరానికి తగినట్టున్నాయి. పూజహెగ్డే వున్న కొద్దిసేపు అలరించింది. విజువల్ కి ఓ మంచి కళ తెచ్చిన హీరోయిన్ లా అనిపించింది. రియల్ తండ్రి కొడుకుల మధ్య వున్న ఎమోషన్ ని రీల్ లైఫ్ లో చూయించటానికి కొరటాల శివ చేసిన ప్రయత్నం బావుంది. కధకి తగినట్టు పోతున్న అన్ని అంశాలు కలిసి కొంచం హడావిడి లేకుండా సాగే చిత్రం. ధర్మానికి వచ్చిన ఆటంకాన్ని ఎదుర్కొనే పాత్రలో తండ్రి కొడుకులు ఇద్దరు బాగా నటించారు.ధర్మాలు తప్పులు ఒప్పులు మరిచిపోయి కేవలం బ్రతకడమే ప్రధానం అని జీవితంతో పోరాటం చేస్తున్న ఈ రోజుల్లో, ధర్మానికి ఆటంకం వచ్చినప్పుడు దేవుడే దిగి రానవసరం లేదు ధర్మాన్ని పాటించే వారు, నమ్మేవారు ఎవరైనా అధర్మానికి ఎదురెళ్లి పోరాటం చేయటం బాధ్యత అని గుర్తుచేస్తుంది ఈ చిత్రం. నిజానికి ఇది మనిషిగా అలవర్చుకోవాల్సిన నిత్య బాధ్యత.ఎవరో ఏదో చేస్తారని కూర్చోకుండా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించటం ఆచరించటమే ముగింపుగా అర్ధం చేసుకున్న వాళ్ళకి ఈ చిత్రం అంకితం చేయబడుతుంది ,అర్ధం అవుతుంది, ఆకట్టుకుంటుంది. 
-- 
అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog