Sarkar vari pata/ సర్కారు వారి పాట

 

సర్కారు వారి పాట :- పాట పాడించి మరీ పైసా వసూల్ చేస్తాడు 

పరశురామ్ డైరెక్ట్ చేసిన మహేష్ బాబు ప్రొడక్షన్ లో 60కోట్ల బడ్జెట్ తో రూపొందిన సర్కారు వారి పాట సినిమా 12న విడుదలై ప్రేక్షకులలో  ఓ మిశ్రమమైన అభిప్రాయాన్ని ఖాతాలో వేసుకొంది. ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఎంచుకొన్నారు పరశురామ్. కొంత మహేష్ హీరోయిజాన్నీ ఎలివేట్ చేస్తూ సాగుతుందీ సినిమా. థమన్ సంగీతం అందరికి తెలిసిన కళావతి, పెన్నిఅనే 2 పాటలు మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. మహేష్ ని మాస్ హీరోలా చూయించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ ప్రథమార్ధంలో నెగెటివ్ ఎంట్రీలో కనిపించిన ద్వితీయార్ధంలో జరిగే సంఘటనలతో అది బాగానే అమర్చినట్టు అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో హీరో హీరోయిన్ ల మధ్య సన్నివేశాలు కొంతసేపు హాస్యం కొంచం ప్రేమ కలగలిపి పండిస్తాయి. ఇండియాలో కధకి బీజం వేసి అమెరికాలో పోషించి మళ్ళీ ఇండియాలోనే ముగించారు. అక్కడక్కడా సడెన్ గా లాజిక్ లేదనిపించే సీన్ చూయించినా వాటికి క్లైమాక్స్ లో సమాధానం ఇచ్చాడు పరశురామ్. ఏదైనా ఓ వ్యక్తి చేసే మంచి ఆలోచనకి సమాజంలో వచ్చే మార్పు వలన ఎంతటి విజయమైనా వరిస్తుంది అనే తెలిసిన మెసేజ్ ని మళ్ళి తెలియచేశారు. బ్యాంక్స్ - వాటి అప్పులను ఇతివృత్తంగా తీసుకొని కథను తీర్చిదిద్దారు. టైటిల్ సరిగ్గానే సరిపోయింది అనిపిస్తుంది. ఆహా ఓహో అనకపోయినా సో సో గా ఉన్నావే చెలియా అనేలా ఉందీ సినిమా... 
-- అవ్యజ్ (శంకర్) 
వ్యక్తిగత రేటింగ్ - 2.5 /5

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog